కార్తీకదీపం నిరుపమ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

సినిమాల్లో నటించే సెలబ్రిటీలతో పోలిస్తే సీరియళ్లలో నటించే సెలబ్రిటీల పారితోషికం తక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.అయితే కొంతమంది బుల్లితెర తారలు మాత్రం తన రేంజ్, క్రేజ్ కు తగిన పారితోషికం తీసుకుంటున్నారు.

 Kartheeka Deepam Serial Fame Nirupam Paritala Property Details Here, Five Crores-TeluguStop.com

బుల్లితెర సీరియళ్లలో నంబర్ 1 సీరియల్ అయిన కార్తీకదీపం సీరియల్ లోని డాక్టర్ బాబు పాత్రకు నిరుపమ్ తన నటనతో ప్రాణం పోశారనే చెప్పాలి.

ఈ సీరియల్ కు ముందూ తరువాత నిరుపమ్ చాలా సీరియళ్లలో నటించినా ఈ సీరియల్ స్థాయిలో ఆ సీరియళ్లకు రేటింగ్ రాలేదు.

అయితే కొన్ని సినిమాలు, సీరియళ్లలో నటించిన నిరుపమ్ బాగానే ఆస్తులు కూడబెట్టారని తెలుస్తోంది.గతంతో పోలిస్తే నిరుపమ్ రెమ్యునరేషన్ ను కూడా భారీగా పెంచేశారని ఈ సీరియల్ కోసం రోజుకు 22వేల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని తెలుస్తోంది.

ఈ సీరియల్ తో పాటు హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ లో నిరుపమ్ నటిస్తున్నారు.

Telugu Career, Doctbabu, Nirupam, Nirupam Cars, Vizag-Movie

ప్రతిరోజు సీరియల్స్ షూటింగ్ జరగకపోయినప్పటికీ రెండు సీరియల్ షూటింగ్స్ ఒకేరోజు జరిగితే ఆరోజు నిరుపమ్ ఆదాయం 40వేల రూపాయల కంటే ఎక్కువగా ఉంటుంది.హైదరాబాద్ లో నిరుపమ్ కు 80 లక్షల రూపాయల ఫ్లాట్ ఉందని వైజాగ్ లో 5 కోట్ల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ ఉందని తెలుస్తోంది.వీటితో పాటు నిరుపమ్ కు సొంతంగా రెండు కార్లు ఉన్నాయని సమాచారం.

Telugu Career, Doctbabu, Nirupam, Nirupam Cars, Vizag-Movie

నిరుపమ్ కార్ల విలువ 11 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉంటుందని తెలుస్తోంది.నిరుపమ్ భార్య కూడా సీరియల్స్ లో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.సినిమాలపై కెరీర్ తొలినాళ్లలో దృష్టి పెట్టిన నిరుపమ్ ఆ తర్వాత సీరియళ్లలోనే కెరీర్ ను కొనసాగించడం గమనార్హం.కార్తీకదీపం సీరియల్ కు మంచి రేటింగ్స్ వస్తుండటంతో మరో రెండు మూడేళ్ల వరకు ఈ సీరియల్ కు శుభం కార్డు పడదని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube