ఓటీటీలో ప్రీమియర్ షో వేస్తున్న నారప్ప

టాలీవుడ్‌లో రీమేక్ చిత్రాల హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు స్టార్ హీరో వెంకటేష్.ఈయన చేసే సినిమాలకు అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ లభిస్తుండనడంలో ఎలాంటి అనుమానం లేదు.

 Narappa Premiere Show In Amazon Prime, Narappa, Venkatesh, Amazon Prime, Asuran-TeluguStop.com

ఇక వెంకీ తాజాగా నటిస్తున్న ‘నారప్ప’ చిత్రం నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన ‘అమెజాన్ ప్రైమ్’లో మరికొద్ది గంటల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది.కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతపడటంతో ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు రెడీ అయ్యారు.

కాగా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను వెంకీ ఖచ్చితంగా అలరిస్తారని చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.

అయితే ఈ సినిమాను జూలై 20న అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో సైతం మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది.కాగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ మరో సర్‌ప్రైజ్ ఇవ్వనుంది.

ఈ సినిమాను ప్రకటించిన సమయానికంటే ముందే ఓటీటీలో స్ట్రీమ్ చేయనున్నారు.నారప్ప చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో జూలై 19న రాత్రి 10 గంటలకు భారత ప్రేక్షకులు వీక్షించవచ్చు.అటు అమెరికా ప్రేక్షకులకు ఈ సినిమా రాత్రి 12.30 నుండి అందుబాటులో ఉండనుంది.ఇలా చెప్పిన సమయానికంటే ముందే నారప్ప అమెజాన్‌లో ప్రత్యక్షం కానుండటంతో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

తమిళంలో సూపర్ సక్సె్స్ మూవీగా నిలిచిన ‘అసురన్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నారప్ప ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube