ఈ చిన్నప్పటి ఫొటోలో కనిపిస్తున్న యంగ్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా...?

తెలుగులో ఆ మధ్య ప్రముఖ దర్శకుడు మరియు నిర్మాత “ఎమ్మెస్ రాజు” దర్శకత్వం వహించిన డర్టీ హరి చిత్రంలో హీరోయిన్ గా నటించి తన అందాల ఆరబోతతో కుర్రకారు మతి పోగొట్టిన పంజాబీ బ్యూటీ సిమ్రత్ కౌర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఈ చిత్రంలో నటించడానికంటే ముందుగా “ఆర్ఎక్స్ 100” మూవీ ఫేమ్ “కార్తికేయ గుమ్మకొండ” హీరోగా నటించిన “ప్రేమతో మీ కార్తీక్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయింది.

 Dirty Movie Fame Simrat Kaur Childhood Memories Shared, Dirty Movie, Simrat Kaur-TeluguStop.com

కానీ ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడికి హీరోయిన్ గా గుర్తింపు లభించలేదు.కానీ డర్టీ హరి చిత్రంలో బోల్డ్ గా కనిపించడంతో సినిమా అవకాశాలు బాగానే క్యూ కడుతున్నట్లు సమాచారం.

కాగా ఈ మధ్య కాలంలో నటి “సిమ్రత్ కౌర్” సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటోంది.కాగా తాజాగా సిమ్రత్ కౌర్ తన చిన్నప్పటి ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

అలాగే ఇటీవలే తన పుట్టిన రోజు కావడంతో తనకు తానుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తన తల్లిదండ్రులు గర్వపడే పనులు చేయడానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని చెప్పుకొచ్చింది.దీంతో పలువురు నెటిజన్లు మరియు సెలబ్రిటీలు సిమ్రత్ కౌర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Telugu Dirty, Dirtysimrat, Simrat Kaur, Simratkaur-Movie

ప్రస్తుతం ఈ అమ్మడికి టాలీవుడ్ లో పెద్దగా సినిమా ఆఫర్లు ఏమీ లేవు.దీంతో వెబ్ సిరీస్ లో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.కాగా ఇటీవలే ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న పంజాబీ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.కాగా పలు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ లో కూడా సిమ్రత్ కౌర్ నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube