వైరల్ వీడియో.. పట్టాల పైకి కారు.. పోలీస్ ఛేజింగ్.. ఆ తర్వాత !

ఒక వ్యక్తి తన డ్రైవింగ్ తో పోలీసులకు కూడా పిచ్చి ఎక్కించాడు.తన కారుతో నానా బీభత్సం సృష్టించాడు.

 Stolen Range Rover Driven On Rail Tracks As Thief Flees Cops, Car On Railway Tra-TeluguStop.com

కారుతో ఏకంగా పోలీసులు వాహనమే గుద్ది పారిపోయాడు.ఆ తర్వాత ఏకంగా రైలు పట్టాల మీదనే కారు నడిపి రచ్చ రచ్చ చేసాడు.

ఈ దృశ్యాలు అన్ని సిసి టివి లో రికార్డ్ అయ్యాయి.వీటిని చుస్తే చిన్న పాటి యాక్షన్ సినిమా చూసినట్టు ఉంది.

డ్రైవింగ్, ఛేజింగ్, రన్నింగ్ ఇలా అన్ని ఉన్నాయి ఈ ఘటనలో.

ఈ ఘటన బ్రిటన్ లో జరిగింది.

అతడు కారును ఆగమేఘాల మీద నడిపి ప్రజలు ప్రాణాలతో చెలగాటం ఆడాడు.ముందుగా రోడ్డు మీద బీబత్సం చేసి ఆ తర్వాత రైలు పట్టాలు కూడా వదలకుండా అక్కడ కూడా రచ్చ చేసాడు.

రోడ్డు మీద పోలీసుల వాహనాన్ని ఢీ కొట్టడమే కాకుండా వారు పట్టుకుంటుంటే వారిని కూడా నెట్టేసి కారుతో పరారయ్యాడు.అంతే స్పీడ్ తో అక్కడి నుండి వెళ్లి పోయాడు.

అయితే అతడు నడిపే కారు కూడా తనది కాదని దొంగిలించిందని స్థానిక పోలీసులు తెలిపారు.దొంగతనం చేసిన తర్వాత ఆ కారును రైల్వే స్టేషన్ కు తెచ్చాడు.

అక్కడ పోలీసులకు దొరికి పోవడంతో అతడిని ఆపి బయటకు దిగమన్నారు.కానీ అతడు కారు దిగకుండానే పోలీసులు వెంట పడుతున్నా పొలిసు వాహనాన్ని మిగిలిన వాహనాలను కూడా గుద్దేసుకుంటూ నానా రభస చేసాడు.

ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.పోలీసుల నుండి పారిపోయిన అతడు రైల్వే స్టేషన్ వైపు వెళ్ళాడు.ముందు చూస్తే పట్టాలు.వెనుక చూస్తే పోలీసులు తరుముతున్నారు.ఇక లాభం లేదనుకుని అతడు పట్టాల పైకే కారును ఎక్కించేసాడు.కారు పొగలు వస్తున్నా ఆపకుండా వేగంగా పోనిచ్చాడు.

నేరుగా వెళ్లి ఆగి ఉన్న ట్రైన్ కు గుద్దాడు.పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.మీరు కూడా చూసేయండి.

https://twitter.com/Cyp_Alii/status/1415609842581090305?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1415609842581090305%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Ftrending%2Fviral-video-do-you-see-car-going-on-railway-track-now-watch-these-videos-of-rare-incident-nk-958898.html
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube