మత స్వేచ్ఛ .. భారత్‌కు సీపీసీ ట్యాగ్ ఇవ్వండి: అమెరికాకు 30 పౌర హక్కుల సంస్థల విజ్ఞప్తి

భారతదేశాన్ని “country of particular concern” (CPC) గా గుర్తించాలని ప్రపంచవ్యాప్తంగా 30కి పౌర హక్కుల సంస్థలు తీర్మానం చేసి అమెరికా ప్రభుత్వాన్ని కోరాయి.అంతేకాకుండా మత వివక్షను ప్రోత్సహించే అధికారులు, హిందుయేతరులను బహిరంగంగా శిక్షించాలంటూ కోరాయి.

 Civil Society Organizations Urge Us To Designate India As A 'country Of Particul-TeluguStop.com

అమెరికాలో అంతర్జాతీయ మత స్వేచ్ఛ ప్రారంభ సదస్సు సందర్భంగా ఈ తీర్మానాన్ని ఆమోదించారు.అయితే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలనపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.

మోడీ ప్రభుత్వం మతవివక్షను పాటిస్తున్నప్పటికీ.అమెరికా చూసీచూడనట్లు వదిలివేయడంపై వారు మండిపడుతున్నారు.

ఇకపోతే మత స్వేచ్ఛా చట్టం ప్రకారం.మత స్వేచ్ఛను తీవ్రంగా ఉల్లంఘించినందుకు దోషిగా వున్న దేశానికి సీపీసీ ట్యాగ్‌ను అమెరికా అధ్యక్షుడి అనుమతితో ఆ దేశ కార్యదర్శి జారీ చేస్తారు.

రాష్ట్ర కార్యదర్శి సీపీసీని నియమించినప్పుడు దానిని యూఎస్ కాంగ్రెస్‌కు తెలియజేస్తారు.మత స్వేచ్ఛ ఉల్లంఘనలను నిలిపివేయడానికి రూపొందించబడిన ఆర్ధికేతర విధాన ఎంపికల ద్వారా సీపీసీ ట్యాగ్ పొందిన దేశంపై ఆర్ధిక ఆంక్షలు విధిస్తారు.

అంతర్జాతీయ మత స్వేచ్ఛా సదస్సులో యూఎస్ సెనేటర్, ప్రతినిధుల సభకు చెందిన ఇద్దరు సభ్యులు కూడా భారత్‌లో పరిస్ధితులపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లోని 200 మిలియన్ల మంది ముస్లింలతో పాటు మైనారిటీల హక్కులను పరిరక్షించడంలో భారత ప్రభుత్వ నిబద్ధతపై తాను తీవ్రంగా ఆందోళన చెందుతున్నానని సెనేటర్ ఎడ్ మార్క్‌లీ వ్యాఖ్యానించారు.30 సంస్థలు చేసిన తీర్మానం సందర్భంగా మైనారిటీ వర్గాలపై వేధింపులు, లవ్ జీహాద్, మత మార్పిడి, సీఏఏతో పాటు ఆర్ఎస్ఎస్ భావజాలంపైనా చర్చించారు.యూఎస్‌సీఐఆర్ఎఫ్ మార్గదర్శకాల ప్రకారం భారతదేశాన్ని సీపీసీ కేటగిరీ కిందకు చేర్చాలని వారు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ను కోరారు.

Telugu Civil Society, Civilsociety, Cpc Tag India, India, Ngos, Pm Modi, Uscirf-

కాగా, యూనైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్) గతేడాది భారత్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చాలని నాటి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే.సీఏఏ చట్టం వల్ల భారతదేశంలో మైనారిటీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని యూఎస్‌సీఐఆర్ఎఫ్ 2020 ఏప్రిల్‌లో విడుదల చేసిన తమ వార్షిక నివేదికలో తెలిపింది.అంతేకాకుండా భారత ప్రభుత్వ ఏజెన్సీలు, అధికారులకు చెందిన ఆస్తులను ఫ్రీజ్ చేసేలా ఆంక్షలు తీసుకొచ్చి వారిని అమెరికాలోకి రాకుండా నిషేధించాలని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్‌ను కోరింది.అయితే నివేదికలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను యూఎస్‌సీఐఆర్ఎఫ్‌లోని ఇద్దరు కమిషనర్లు తప్పు పట్టడం విశేషం.

ఈ ప్రతిపాదనపై తొమ్మిది మంది కమిషనర్లలో గేరీ బాయిర్, తెన్‌జిన్ డోర్జీ అనే ఇద్దరు కమిషనర్లు అసమ్మతి వ్యక్తం చేశారు.చైనా, నార్త్ కొరియాల సరసన భారత్‌ను చేర్చడంపై వీరు తప్పుపట్టారు.

Telugu Civil Society, Civilsociety, Cpc Tag India, India, Ngos, Pm Modi, Uscirf-

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య భారతదేశంలో మతస్వేచ్ఛకు సంబంధించి పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని పేర్కొంది.యూఎస్‌సీఐఆర్ఎఫ్ తమ వార్షిక నివేదికలో ముఖ్యంగా ఎన్నార్సీ, సీఏఏల గురించి ప్రస్తావించింది.అంతేకాకుండా ఢిల్లీలో సీఏఏకు మద్దతుగా, వ్యతిరేకంగా జరిగిన దాడులను కూడా నివేదికలో తెలిపింది.వీటితో పాటు భారత ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని కూడా ప్రస్తావించింది.

ఈ కారణంగానే భారత్‌ను ఆందోళనకర దేశాల జాబితాలోకి చేర్చాలని యూఎస్‌సీఐఆర్ఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది.అయితే యూఎస్‌సీఐఆర్ఎఫ్ నివేదికను భారత ప్రభుత్వం కూడా ఖండించింది.భారత్‌పై ఇచ్చిన నివేదికను సొంత కమిషనర్లే వ్యతిరేకించడాన్ని కూడా ప్రస్తావించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube