సరికొత్త రీతిలో జనసేన ఉద్యమం ? వైసీపీకి విసుగు తెప్పించేలా ?

చాలా కాలంగా జనసేన తరపున పెద్దగా యాక్టివ్ కార్యక్రమాలు ఏమి లేవు.కరోనా వైరస్ ప్రభావం తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు, ఆ పార్టీ నాయకులు సైలెంట్ గా ఉన్నారు.

 Janasena Active Moment Againist Ysrcp Government Janasena, Pavan Kalyan, Ysrcp,-TeluguStop.com

అప్పుడప్పుడు మాత్రమే పార్టీ తరఫున ప్రెస్ నోట్ లు మాత్రమే విడుదలవుతూ వచ్చాయి.అయితే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండడం, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బలహీనం కావడం వంటి కారణాలతో పెద్దగా వైసిపికి ఇబ్బందులు లేకుండా పోయాయి.

అయితే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పడుతున్న క్రమంలో యాక్టివ్ గా రాజకీయాలు చేస్తే 2024 నాటికి తమకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు.

ఇటీవల మంగళగిరిలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన పవన్ ఆ సందర్భంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇక వరుసగా వైసీపీ ప్రభుత్వం ను టార్గెట్ చేసుకుని ఇరుకున పెట్టాలని చూస్తున్నారు.దీనిలో భాగంగానే వినూత్న రీతిలో పోరాటం చేసేందుకు జనసేన సిద్ధమవుతోంది.దీనిలో భాగంగానే జనసేన పార్టీ వినతి పత్రాల ఉద్యమం చేపట్టబోతోంది.ఏపీలో యువతను ఆకర్షించేందుకు నిరుద్యోగ సమస్యను హైలెట్ చేసేందుకు సిద్ధమవుతోంది.

దీనిలో భాగంగానే ఏపీలో నిరుద్యోగులకు అండగా తమ పార్టీ ఉంటుందని, ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిందంటూ పవన్ విమర్శలు చేశారు.

Telugu Ap, Janasena, Janasenani, Pavan Kalyan, Un, Ysrcp-Telugu Political News

దీనికి నిరసనగా జనసేన తరపున ఈనెల 20వ తేదీన ఉపాధికల్పన అధికారులకు వినతి పత్రాలు ఇస్తుందని ప్రకటించారు.ప్రభుత్వం ప్రకటించిన అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఆ హామీని మరిచిపోయిందని పవన్ మండిపడ్డారు.

ఏపీలో ప్రైవేటు పరిశ్రమలలో కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఇక ఇదే సమస్య పైన కాకుండా, ప్రతి సమస్య పైన వినతి పత్రాల ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా, జనసేన పై అభిమానం పెరిగేలా ముందుకు వెళ్లాలని పవన్ డిసైడ్ అయినట్టుగా కనిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube