ఆ విషయంలో ఆపిల్ కంపెనీను బీట్ చేసిన చైనా కంపనీ..!

ఈ కాలంలో ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది.స్మార్ట్ ఫోన్ కొనాలని భావించేవారు ముందుగా చూసుకునేది ఏంటంటే ఫోన్ ఏ కంపనీకి చెందింది.

 The Chinese Company That Beat Apple In That Regard, Xiaomi, Overtake, Apple, Com-TeluguStop.com

దానిలో ఎన్ని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.?, అసలు ఫోన్ ధర ఎంత.? అనే విషయాలు ముందుగా చూసుకుని అప్పుడు ఫోన్ కొంటారు కదా.అయితే ఇప్పుడు ఈ క్రమంలో ఎవరు ఫోన్ కొనాలన్నా ముందుగా ప్రెఫర్ చేసేది శాంసంగ్ కంపనీ మొబైల్ కి.ఆ తరువాత యాపిల్ కంపనీ.కాకపోతే ఇప్పుడు చైనాకు చెందిన షావోమి కంపెనీ అందరి దృష్టిని ఆకర్షించింది అనే చెప్పాలి.

చాలామంది ఈ కంపెనీకి సంబందించిన ఫోన్స్ ను కొనుగోలు చేస్తున్నారు.షియోమి కంపెనీ తయారు చేసిన స్మార్ట్ ఫోన్లు నిమిషాల్లో అమ్ముడయిపోతున్నాయి.

మొబైల్స్ సేల్స్ పరంగా నెంబర్ 1 పొజిషన్ లో ఎప్పుడు కూడా శాంసంగ్ ఉంటూనే ఉంటుంది.అయితే ఆ తర్వాత స్థానంలో ఆపిల్ కంపనీ ఉండేది.కానీ, ఇప్పుడు చైనాకు చెందిన షావోమి ఆపిల్ కంపనీ స్థానాన్ని భర్తీ చేసి నెంబర్ 2 స్థానంలో నిలిచింది.‘కెనాలసిస్‌‘ డేటా ప్రకారం మార్కెట్‌ విక్రయాల్లో శాంసంగ్‌ వాటా 19 శాతం ఉండగా, షావోమి 17 శాతంతో రెండో స్థానంలో నిలిచింది.అలాగే యాపిల్‌ కు మార్కెట్‌ లో 14 శాతం వాటాతో ఉన్నట్లు తేలింది.

Telugu Apple, China, Company, Flash, Overtake, Latest, Xiaomi-Latest News - Telu

షావోమి ఫోన్ సేల్స్ ఎప్పుడు అయితే పెరిగాయో షావోమి ఫోన్స్ తయారీ కూడా గణనీయంగా పెరిగిందని చెప్పాలి.షావోమి ఎగుమతులు ఏఏ దేశాలకు ఎలా పెరిగాయంటే, లాటిన్ అమెరికాకు 300%, ఆఫ్రికాకు 150%, పశ్చిమ యూరప్ కు 50% దాక పెరిగాయి.అయితే ఇదే సేల్స్ కనుక ఇక మీదట కనిపిస్తే ప్రస్తుతం నెంబర్ 1 స్థానంలో ఉన్న శాంసంగ్‌ కంపనీ ఫోన్ సేల్స్ కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది.

నోట్‌ 10 సహా ఎంఐ సిరీస్‌లో వచ్చిన ఫోన్లు షావోమి అమ్మకాల పెరుగుదలకు దోహదపడ్డాయి.అయితే స్మార్ట్ ఫోన్ల సేల్స్ లో ఇలా షావోమి టాప్ 2 పొజిషన్ కు రావడం ఇదే మొదటిసారి అవ్వడం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube