తెలుగు ఎన్.ఆర్.ఐ డైలీ న్యూస్ రౌండప్

1.అమెరికా కార్మిక శాఖ కొత్త సొలిసిటర్ గా భారతీయ అమెరికన్

అమెరికా అధ్యక్షుడు బయం పరిపాలన విభాగంలో మరో భారత సంతతి మహిళకు కీలక పదవి దక్కింది.భారతీయ అమెరిక పౌర హక్కుల న్యాయవాది సీమా నందాను కార్మిక శాఖ కొత్త సొలిసిటర్ గా అమెరికా సెనేట్ ధ్రువీకరించింది.

 Telugu Nri News Roundup, Nri News In Telugu, Nri News, Canada, Indians, Us, Immi-TeluguStop.com

2.కువైట్ ఆస్పత్రిలో భారత వ్యక్తి ఆత్మహత్య

కువైట్లోని పర్వానియా ఆసుపత్రిలో ఐసియూ విభాగం లో చికిత్స పొందుతున్న భారత వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఆసుపత్రి భవనం రెండో అంతస్తు నుంచి దూకడం తో ప్రాణాలు కోల్పోయాడు.అయితే మృతుడి పూర్తి వివరాలు తెలియకపోవడంతో కువైట్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

3.సానియా మీర్జా కు యూఏఈ గోల్డెన్ వీసా

Telugu Canada, Covid, Passport, Indians, Latest Nri, Nri, Nri Telugu, Saniamirza

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆమె భర్త పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు అరుదైన గౌరవం దక్కింది.యూఏఈ ప్రభుత్వం ఈ దంపతులకు పదేళ్ల గోల్డెన్ వీసా తో సత్కరించింది.

4.కరోనా పై అమెరికా సర్జన్ జనరల్ వివేక్ మూర్తి ఏమన్నారంటే ?

అమెరికా సర్జన్ జనరల్గా ఉన్న భారత సంతతికి చెందిన డాక్టర్ మూర్తి వైట్ హౌస్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రజలు కర్నూల్ నుంచి తమను తాము కాపాడుకోవాలంటే తప్పనిసరిగా టీకా తీసుకోవాలని, తమ కుటుంబంలో పది మందిని ఈ మహమ్మారి బలి తీసుకుందని, ఈ విషాదం ఏ ఇంట్లోనూ జరగకుండా ఉండాలంటే టీకా తప్పనిసరి అంటూ వ్యాఖ్యానించారు.

5.అంతరిక్షంలోకి అమెజాన్ అధినేత … భారతీయుల ప్రతిభ

Telugu Canada, Covid, Passport, Indians, Latest Nri, Nri, Nri Telugu, Saniamirza

ఈనెల 20న అమెజాన్ అధినేత బెజోస్ అంతరిక్ష యాత్ర చేయబోతున్నారు.ఈ మేరకు బ్లూ ఆరిజన్ రోదసిలో కి వెళ్లనుంది.జెఫ్ బెజొస్ సహా మరో ముగ్గురికి అంతరిక్ష యానం చేసేందుకు అమెరికా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.ఈ బ్లూ ఆరిజన్ రాకెట్ ను తయారుచేసిన బృందంలో భారతీయ మహిళ ఇంజినీర్ సంజల్ గావాండే (30) ఉన్నారు.ఈమె మహారాష్ట్రలోని కళ్యాణ ప్రాంతానికి చెందిన వారు.

6.తాలిబన్ల దాడిలో భారతీయ జర్నలిస్ట్ మృతి

ప్రముఖ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీ రాయ్టర్స్ లో  ఫోటో జర్నలిస్ట్ గా పనిచేస్తున్న పులిడ్జర్ అవార్డ్ విజేత డానిష్ సిద్ధిఖీ ఆఫ్గాన్ లోని తాండూర్ లో జరిగిన తాలిబన్ల దాడిలో మరణించాడు.

7.నార్త్ కరోలినా లో వైఎస్సార్ జయంతి ఉత్సవాలు

అమెరికాలో దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పౌండేషన్ ఆధ్వర్యంలో నార్త్ కరోలినా రాష్ట్రం షార్లెట్ నగరంలో వైయస్సార్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేశారు .అనంతరం సామూహిక భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

8.భారత్ కారణంగానే వాక్సిన్ల కొరత : యూఎస్ ఏజెన్సీ నివేదిక

Telugu Canada, Covid, Passport, Indians, Latest Nri, Nri, Nri Telugu, Saniamirza

భారత్ లో కరోనా సెకండ్ వేవ్ కారణంగానే  భారత్ వాక్సిన్ సరఫరా తగ్గించింది అని, బైడన్ పరిపాలనా యంత్రాంగం అమెరికా చట్ట సభ సభ్యులకు తెలిపింది.

9.విదేశీ విద్యార్థులకు విమాన ఇబ్బందులు

కరోనా వైరస్ ప్రభావం కారణంగా విదేశీ విద్య పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.ముఖ్యంగా అమెరికాకు ఉన్నత చదువుల నిమిత్తం వెళ్ళాలి అనుకునే వారు తీవ్రంగా నష్టపోతున్నారు.అమ్రికాలో చదువుతున్న విద్యార్థులు కరోనా ప్రభావం తో తమ స్వదేశానికి వెళ్లిపోగా తిరిగి అమెరికా వెళ్లేందుకు వీసా , విమాన ఇబ్బందులతో సతమతం అవుతున్నారు.

10.పాస్ పోర్ట్ జారీకి వేలి ముద్ర తప్పనిసరి

Telugu Canada, Covid, Passport, Indians, Latest Nri, Nri, Nri Telugu, Saniamirza

పాస్ పోర్ట్ ల జారీకి ఇకపై వేలి ముద్రలను తప్పనిసరి చేయనున్నారు.గత రెండేళ్లుగా ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేస్తుండగా ఇక భారత్ లో దీనిని తప్పనిసరి చేయనున్నారు.వేలి ముద్రల ఆధారంగా నేరస్థులకు పాస్ పోర్ట్ జారీ కాకుండా జాగ్రత్త పడనున్నారు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube