హిందీ చత్రపతి కోసం జకన్న ఫ్యామిలీ సాయం

టాలీవుడ్‌ జక్కన్న

రాజమౌళి

స్థాయిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా చత్రపతి.ఆ సినిమా లో ప్రభాస్ ను రాజమౌళి చూపించిన తీరు అద్బుతం అనడంలో సందేహం లేదు.

 Rajamouli Helps To Bellamkonda Srinivas Chatrapathi Movie , Bellamkonda , Chatra-TeluguStop.com

ప్రభాస్ ను ఒక స్టార్‌ హీరోగా నిలబెట్టింది కూడా ఆ సినిమానే అనడంలో సందేహం లేదు.చత్రపతి సినిమా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను అప్పట్లో దక్కించుకుంది.

ప్రత్యేకమైన సినిమా అంటూ అంతా కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.అలాంటి సినిమాను ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో వివి వినాయక్ తెరకెక్కిస్తున్నాడు.

హిందీ చత్రపతి సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.షూటింగ్‌ ప్రారంభోత్సవంలో రాజమౌళి ఫ్యామిలీ భాగస్వామ్యం అవ్వడంతో షూటింగ్‌ సమయంలో కూడా వారి ఇన్వాల్వ్‌ మెంట్‌ ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

ఒక వేళ చత్రపతి హిందీ రీమేక్‌ లో కనుక రాజమౌళి ఫ్యామిలీ వేలు పెట్టితే ఖచ్చితంగా సినిమా బిగ్గెస్ట్‌ సక్సెస్‌ అవ్వడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ప్రభాస్ మరియు శ్రియ శరన్‌ హీరో హరోయిన్ లుగా నటించిన చత్రపతి సినిమా ను హిందీలో బెల్లం కొండ హీరోగా రీమేక్ చేయబోతుండగా హీరోయిన్ గా ఎవురు నటిస్తారు అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

పెద్ద మొత్తంలో సినిమా షూటింగ్ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత పెన్‌ స్టూడియోస్‌ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Telugu Bellamkonda, Bollywood, Chatrapathi, Prabhas, Rajamouli, Sriya, Tollywood

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను హిందీ ప్రేక్షకులు ఆశీర్వదించాలి అంటే జక్కన్న మార్క్‌ మేకింగ్ అవసరం.కనుక విజయేంద్ర ప్రసాద్‌ సలహాలు మరియు సూచనలు మరియు రాజమౌళి యొక్క సలహాలు కూడా ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారు.కనుక ఖచ్చితంగా చత్రపతి సినిమా మరో రేంజ్ లో ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.చత్రపతి హిందీ టైటిల్‌ మరియు హీరోయిన్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube