జగన్ చెప్తే సరే : కేంద్రం వైఖరి మారడానికి కారణం ఇదా ? 

అవసరం ఉంటే ఒకలా అవసరం లేకపోతే ఒకలా మరోలా వ్యవహరించడం , అవసరాలకు అనుగుణంగా పొత్తులు పెట్టుకోవడం, ఎత్తులు వేయడం రాజకీయ పార్టీలకు, ఆ పార్టీ నేతలకు కొత్తేమీ కాదు.2019 ఎన్నికల సమయంలో జగన్ కు అనుకూలంగా బిజెపి వైఖరి ఉండేది.ఎన్నికల ఫలితాల తరువాత అదే తీరు కొంతకాలం కనబరిచినా, ఆ తరువాత పూర్తిగా జగన్ ను బిజెపి శత్రువుగా చూడడం మొదలుపెట్టింది.రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏపీ బీజేపీ నాయకులు టార్గెట్ చేసుకుని అదే పనిగా విమర్శలు చేసిన కేంద్ర బిజెపి పెద్దలు ఏపీ విషయంలో అన్యాయం చేస్తున్నా, జగన్ మాత్రం కేంద్రాన్ని పల్లెత్తుమాట అనకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చారు.

 Central Bjp Is Making Decisions In Favor Of Ap Cm Jagan, Jagan, Ysrcp, Ap Cm, C-TeluguStop.com

అయితే సుదీర్ఘకాలం ఇదే పరిస్థితి ఉండదనే విషయాన్ని జగన్ తన చర్యల ద్వారా చూపించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్రం ఇప్పుడు జగన్ రూట్లోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

కొద్ది రోజులుగా ఏపీ తెలంగాణ మధ్య వివాదం తీవ్రమైన నేపథ్యంలో, గత కొంతకాలంగా ఈ సమస్యను పరిష్కరించాలంటూ జగన్ ప్రధాని నరేంద్ర మోదీ, జలశక్తి మంత్రికి లేఖలు రాస్తున్నారు.

కృష్ణ, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.ఈ డిమాండ్ ను కేంద్రం పట్టించుకోలేదని అందరూ అనుకున్నా , ఇప్పుడు జగన్ కోరిక మేరకు కేంద్రం స్పందించింది.

కృష్ణా గోదావరి నదులు సంబంధించి బోర్డు పరిధులను నిర్ణయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంటూ గెజిట్ విడుదల చేసింది.దీంతో తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ కేంద్రం నిర్ణయంపై మండిపడుతోంది.

Telugu Ap Cm, Bjp, Central, Jagan, Telangana, Ysrcp-Political

ఏపీకి అనుకూలంగా కేంద్రం వ్యవహరించిందని , తెలంగాణకు అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.అయితే ఒక్కసారిగా జగన్ విషయంలో కేంద్రం తన వైఖరిని మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది.దీనిలో భాగంగానే వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కు అనర్హత వ్యవహారంపై నోటీసులు ఇవ్వడం తదితర పరిణామాలు చోటు చేసుకోవడంతో, జగన్ కు దగ్గరయ్యేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.రాబోయే రోజుల్లో జగన్ అవసరం టిఆర్ఎస్ కంటే ఎక్కువగా ఉండడంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Telugu Ap Cm, Bjp, Central, Jagan, Telangana, Ysrcp-Political

అదీ కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీ కి వ్యతిరేకంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుండటం, కాంగ్రెస్ తోనూ ఆయన ఇప్పుడు సన్నిహితంగా మెలుగుతూ, బిజెపి ని గద్దె దించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం, జగన్ కూడా బిజెపి వైఖరి కారణంగా పీకే డైరెక్షన్ లో నడుస్తారనే అభిప్రాయం కేంద్రంలో కలగడంతో ఇప్పుడు జగన్ దగ్గర చేసుకునేందు కే జగన్ డిమాండ్లను నెరవేర్చే దిశగా బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా కనిఇస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube