లోకేష్ కు ఎన్టీఆర్ ముప్పు ?

ఏపీలో తెలుగుదేశం పార్టీకి పెద్ద చిక్కే వచ్చిపడింది.చంద్రబాబు రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకునే స్టేజ్ కి వచ్చేయడంతో సర్వస్వం తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ అవుతాడనే అందరూ ఊహిస్తున్నారు.

 Lokesh Troubled On Ntr Political Entry Demand Nara Lokesh, Tdp, Jr Ntr, Young Ti-TeluguStop.com

దానికి తగ్గట్లుగానే ఈ మధ్యకాలంలో ఆయన రాజకీయంగా మంచి పనితీరు కనబరుస్తున్నారు.పార్టీ నేతలను పరామర్శించడంతో పాటు, ప్రజా సమస్యలపైన వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

జిల్లాల వారిగా పర్యటనలు చేస్తూ నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ లోకేష్ తానేంటో నిరూపించుకుంటున్నారు.చంద్రబాబుకు వయస్సు పై బాడడమో, లోకేష్ ను ప్రమోట్ చేసేందుకో తెలియదుగానీ, ఆయన చాలా కాలంగా సైలెంట్ గా ఉంటున్నారు.

దీంతో లోకేష్ ప్రభావం టిడిపిలో ఎక్కువగా కనిపిస్తోంది.గతంలో తన కారణంగా పార్టీ దెబ్బతింది అంటూ వచ్చిన ఆరోపణలకు చెక్ పెట్టే విధంగా పార్టీని పుంజుకునేలా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇంతవరకు పరిస్థితి లోకేష్ కు అనుకూలంగానే ఉంటూ వచ్చినా, ఈ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ పదేపదే వస్తోంది ఎన్టీఆర్ వస్తేనే తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పునర్వైభవం వస్తుందని చంద్రబాబు ముందే పార్టీ నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు నినాదాలు చేస్తూ ఉండటం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది.చిత్తూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు లోకేష్ టీమ్ లో కలవరం పుట్టిస్తున్నాయి.

Telugu Ap, Chandrababu, Chinababu, Jr Ntr, Lokesh, Ntr Tdp, Ntrs Fans, Tdp Fans,

రాజకీయంగా లోకేష్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సమయంలో పదేపదే ఎన్టీఆర్ ప్రస్తావన వస్తుండడంతో లోకేష్ గ్రాఫ్ పడిపోతోందని, ఇప్పట్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకపోయినా, పదేపదే ఆయన పొలిటికల్ ఎంట్రీపై డిమాండ్ వినిపిస్తున్న వ్యవహారాలు వంటివి లోకేష్ శక్తి సామర్థ్యాలపై అందరికీ అనుమానాలు పెంచడంతో పాటు, లోకేష్ కు అవమానకరంగా ఈ వ్యవహారాలు మారిపోయాయి.ఈ విషయాలపైనే లోకేష్ తన సన్నిహితుల వద్ద వాపోతున్నారట.అసలు ఇప్పటికే ఎన్టీఆర్ తాను రాజకీయాల్లోకి వచ్చేది లేదు అంటూ ప్రకటించినా, ఆయన రావాలనే డిమాండ్ మాత్రం రోజురోజుకు ఉదృతం అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube