నిరుద్యోగ యువత సమావేశంలో జగన్ ప్రభుత్వం పై లోకేష్ సీరియస్ కామెంట్స్..!!

నారా లోకేష్ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిరుద్యోగ యువతతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో సీరియస్ కామెంట్స్ చేశారు.

 Lokesh Serious Comments On Ys Jagan Lokesh, Ys Jagan,latest Ap News,tdp,ysrcp-TeluguStop.com

అప్పట్లో చంద్రబాబు ని ఓడించాలంటే వైసీపీ పార్టీ నాయకులు క్యాంపెయిన్ చేశారు.కానీ ఇప్పుడు రాష్ట్రమే ఓడిపోయింది అంటూ లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో నుండి పరిశ్రమలు తరలి వెళ్ళి పోతున్నాయని.అప్పట్లో విభజన జరిగిన సమయంలో హైదరాబాద్ తరలి వెళ్లి పోతే.

ఏ రీతిగా ఆందోళన చెందారు అదే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొంది అని తెలిపారు.

Telugu Ap, Chandrababu, Cm Jagan, Lokesh, Ys Jagan, Ysrcp-Telugu Political News

ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో రాష్ట్రంలో ఆరు లక్షలు ఉద్యోగం ఇచ్చినట్లు.పేర్కొనడం చూసి తనకి షాక్ ఇచ్చినట్లు అయిందని తెలిపారు.వైసీపీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సమయంలో రాష్ట్రంలో నాలుగు లక్షల 77 వేల ఉద్యోగాలు.

ఇచ్చినట్లు పేర్కొన్న ప్రభుత్వం ఎప్పుడు 15 రోజుల వ్యవధిలో నాలుగు లక్షల 30 వేల ఉద్యోగాలు ఎక్కడ నుండి ఇచ్చారని ప్రశ్నించారు.న్యాయబద్ధంగా చూసుకుంటే ప్రభుత్వం ఇప్పటిదాకా ఇచ్చిన ఉద్యోగాలు కేవలం పదిహేను వేలు మాత్రమే అని పేర్కొన్నారు.

ఏదో ఒక సినిమా లో ఒక రూపాయి ఇచ్చి పండుగ చేసుకుని బ్రహ్మానందం అన్నట్టు… రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న పరిస్థితి ఉందని లోకేష్ సెటైర్లు వేశారు.రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి కేవలం 15 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి పండుగ చేసుకోండి అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఇది చేతగాని ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.

ఇటువంటి పరిపాలన వల్ల రాష్ట్రంలో దాదాపు ఏడు లక్షల మంది యువతీ యువకులు నిరుద్యోగులు అయ్యారని, దక్షిణాది రాష్ట్రాలలో అత్యధిక నిరుద్యోగులు కలిగిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది అని లోకేష్ విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube