చరణ్‌.. శంకర్ మూవీ సంగీత దర్శకుడు పై సస్పెన్స్‌

సౌత్‌ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న దర్శకుడు శంకర్‌.ఈయన దర్శకత్వం లో సినిమా అంటే అది ఒక అద్బుతం అంటూ రోబో సమయం నుండి టాక్ ఉంది.

 Mega Fans Want A R Rahaman As Charan And Shankar Movie Music Director,latest Tol-TeluguStop.com

ఆయన ప్రతీది అద్బుతంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.అలాంటి శంకర్ దర్శకత్వం లో మన మెగా హీరో రామ్ చరణ్‌ నటించబోతున్నాడు.

ఆయన ఆర్‌ ఆర్‌ ఆర్‌ తో టాలీవుడ్‌ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో కూడా స్టార్‌ గా గుర్తింపు దక్కించుకున్నాడు.ఈయన నటించ బోతున్న శంకర్ మూవీ కూడా పాన్ ఇండియా బిగ్గెస్ట్‌ మూవీగా రూపొందబోతున్నట్లుగా చెబుతున్నారు.

దాదాపుగా 250 కోట్ల బడ్జెట్‌ తో దిల్‌ రాజు ఈ సినిమా ను నిర్మిస్తున్నాడు.ఈ సినిమా కోసం సాయి మాధవ్‌ బుర్ర డైలాగ్స్ ను రాస్తున్నాడు.

ఇటీవలే ఆ అప్ డేట్‌ వచ్చింది.కనుక ఈ సినిమా షూటింగ్‌ మొదలుకు రంగం సిద్దం అవుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇక శంకర్‌ మరియు చరణ్‌ ల మూవీ కి సంగీత దర్శకుడు ఎవరు అంటే అంతా కూడా ఆసక్తికర చర్చకు తెర తీస్తున్నారు.

Telugu Rahaman, Dil Raju, Ram Charan, Rrr, Shankar-Movie

శంకర్‌ సినిమా అంటే ఏఆర్‌ రహమాన్ సంగీతం అందిస్తూ ఉంటారు.కాని ఈసారి మాత్రం ఆయన కాదు అంటూ ఆమద్య వార్తలు వచ్చాయి.కాని చరణ్‌ అభిమానులు మాత్రం రహమాన్ ను సంగీత దర్శకుడిగా కోరుకుంటున్నారు.

దిల్ రాజు కూడా కాస్త ఎక్కువ బడ్జెట్‌ అయినా కూడా రహమాన్ ను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.గతంలో శంకర్‌ మరియు రహమాన్ ల కాంబోలో వచ్చిన పాటలు సూపర్‌ హిట్‌ అయ్యాయి.

కనుక ఈ సినిమా కు కూడా ఆయన సంగీతం అందిస్తే మరో లెవల్‌ లో ఉంటుంది.తెలుగు మరియు తమిళంలో ఈయన పాటలకు విపరీతమైన అభిమానులు ఉన్నారు.

ఈమద్య కాలంలో హిందీలో కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.కనుక రహమామన్‌ ను ఈ బిగ్గెస్ట్‌ పాన్ ఇండియా సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

మరి అది ఎంత వరకు సఫలం అవుతుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube