ట్రైలర్ టాక్ : 'నారప్ప' మరో దృశ్యం అంటూ కామెంట్స్‌

తమిళంలో ధనుష్ నటించిన అసురన్‌ సినిమాను తెలుగు లో వెంకీ మామ నారప్ప టైటిల్ తో రీమేక్ చేశాడు.గత ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసి విడుదల చేయాల్సి ఉన్నా కూడా అన్ని సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా కరోనా కారణంగా నిలిచి పోయింది.

 Venkatesh Narappa Movie Trailer Talk , Amazone Prime,  Film News In Telugu,  Nar-TeluguStop.com

షూటింగ్‌ బ్యాక్ టు బ్యాక్ అవరోదాల కారణంగా ఎట్టకేలకు ముగిసింది.షూటింగ్‌ ముగిసిన తర్వాత కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

ఇక థియేటర్లోల విడుదల ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు అంటూ నిర్ణయానికి వచ్చి నారప్ప ను చిత్ర యూనిట్‌ సభ్యులు అమెజాన్ లో విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.అమెజాన్ లో స్ట్రీమింగ్‌ కు సిద్దం అయిన నేపథ్యంలో వారు ట్రైలర్‌ ను విడుదల చేశారు.

అమెజాన్ లో వచ్చే వారం స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్‌ కు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది.

నారప్ప సినిమా కుటుంబం ఒక సామన్య కుటుంబం.

వారికి జరిగిన అన్యాయం కు పగ తీర్చుకునేందుకు సిద్దం అవుతారు.అందుకోసం వారు ఏం చేశారు అనేది సినిమాలో చూపించబోతున్నరు.

సినిమా ట్రైలర్ చూస్తుంటే కాస్త దృశ్యం ఛాయలు కనిపిస్తున్నాయి అంటూ నెటిజన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Amazone Prime, Telugu, Ppa, Ppa Trailer, Priyamani, Venkatesh-Movie

రెండు కథలు వేరు అయ్యి ఉండవచ్చు కాని ఒక రివేంజ్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని మాత్రం ట్రైలర్‌ చూస్తుంటే అనిపిస్తుందని టాక్ వినిపిస్తుంది.పెద్ద ఎత్తున అంచనాలు ఉన్న నారప్ప సినిమా ట్రైలర్‌ కొందరికి పాజిటివ్ గా అనిపిస్తే కొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు.మరీ హింస ఎక్కువ అయ్యిందా అంటే ఔను అని కొందరు అంటున్నారు.

అయితే తమిళ వర్షన్ ను చూసిన వారు మాత్రం మక్కీకి మక్కీ దించేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube