పెండ్లిలో ట్విస్టు ఇచ్చిన ఫ్రెండ్స్‌.. ఏంటో తెలిస్తే షాక్‌!

పెళ్లంటే నూరేళ్ల పంటలా భావిస్తుంటారు పెద్దలు.కానీ నేటి తరం యువతీ, యువకులు పెళ్లిని అంత సీరియస్ గా తీసుకోకుండా ఎంజాయ్ చేస్తున్నారు.

 Friends Who Gave A Twist At The Wedding ‌ Shock If You Know Something, Friends-TeluguStop.com

కరోనా కంగారుపెట్టిన సమయంలో దేశవ్యాప్తంగా పెళ్లిళ్లను గ్రాండ్ గా జరిపించడం ప్రభుత్వం నిషేధించింది.కొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లిళ్లు చేసుకోవాలని నిబంధనలు విధించింది.

అయినా కానీ పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు.ఇక పెళ్లి బరాతుల్లో డీజేలు పెట్టడం ఫుల్లుగా మద్యం తాగి గొడవలు పెట్టుకోవడం నానా హంగామా చేసి రూల్స్ బ్రేక్ చేయడం మనం తరచూ వింటూనే ఉంటాం.

చాలా సందర్భాల్లో పెళ్లింట సంబంధం లేని వ్యక్తులు చేసే చేష్టలు పెళ్లి వారికి చికాకు తెప్పిస్తాయి.అంతే కాకుండా వారిని ఇబ్బందుల పాలు చేస్తాయి.

కొన్నాళ్లు ఎటువంటి హంగామా లేకుండా సింపుల్ గా జరిగిన పెళ్లిళ్లు ప్రస్తుతం మాత్రం కాస్తంత హంగామనే సృష్టిస్తున్నాయి.ఇక పెళ్లి సమయాల్లో హంగామా చేసి కేసుల పాలయి కటకటాల్లోకి వెళ్లిన వారు అనేక మంది ఉన్నారు.

కొంత మంది చేసే హంగామా ఒక ఎత్తయితే పెళ్లి సమయంలో ఫొటో గ్రాఫర్లు చేసే హంగామా అంతా ఇంతా కాదు.రకరకాల భంగిమల్లో ఫోజులివ్వమని చెప్పి పెళ్లి కూతురికి, పెళ్లి కొడుక్కి విసుగొచ్చేలా చేస్తారు.

వాళ్లు చేసే అతి చేష్టలు చూస్తే.బయటి వారికే చికాకు వస్తుందంటే ఇంక వధూవరుల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ఇక హంగామా చేసేది స్నేహితులు.వీళ్లు లేకపోతే అసలు పెళ్లిలో కల అనేదే ఉండదు.

చాలా మంది స్నేహితులు పెళ్లికి కానుకలు తీసుకురాకపోయినా.వారు చేసే హంగామా మాత్రం మామూలుగా ఉండదు.

అలా స్నేహితుడి పెళ్లిలో ఈ ఫ్రెండ్స్ ఎంతలా నానా హంగామా చేశారో చూడండి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube