సముద్రంలో కలవని నది ఏది.. అది ఎక్కడుందో తెలుసా?

మన భారతదేశంలో హిందువులు ఎంతో పవిత్రంగా భావించే వాటిలో కేవలం ఆలయాలు మాత్రమే కాకుండా నదులు కూడా ఉన్నాయి.నదులను కూడా హిందువులు ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు.

 The Only River That Does Not Meet At Sea, Yamuna River , Sea, Meet, Ganga River-TeluguStop.com

ఈ క్రమంలోనే మన దేశంలో కొన్ని వందల సంఖ్యలో నదులు ఉపనదులు ఉన్నాయి.ఈ క్రమంలోనే కొన్ని నదులు ప్రాచీనకాలం నుంచి ప్రవహిస్తూ ఉండటంతో నదులకు దేవతల పేర్లు పెట్టి ఎంతో పవిత్రంగా భావించి పూజలు చేసేవారు.

ఈ విధంగా మనదేశంలో ఎన్నో పవిత్రమైన నదులకు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు నిర్వహిస్తారు.మన దేశంలో చాలా నదులు ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలుస్తాయి.

కానీ కేవలం ఓకే ఓక నది మాత్రం సముద్రంలో కలవదు.వినడానికి ఎంతో ఆశ్చర్యం కలిగించిన ఇది నిజం.

మరి ఆనది ఏది? ఆనది విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

చాలా పురాణాలలో ఈ నది ప్రస్తావన వచ్చింది.

కురుక్షేత్ర కాలం నాటి నుంచి ఇప్పటి వరకు ఈ నది ఒకే సాధారణ నీటిమట్టంతో ప్రవహిస్తూనే ఉంది.అందుకే ఈ నదిని జీవనది అని పిలుస్తారు.

ఇంత విశిష్టత కలిగిన ఈ నది పేరు యమునా.హిమాలయ పర్వతాలలో పుట్టిన ఈ నదికి ఎంతో చరిత్ర ఉంది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ కు ఉత్తరాన ఉన్న యమునోత్రి వద్ద ఈ నది ప్రవహించడంతో ఈ నదికి యమునా నది అనే పేరు వచ్చింది.ఈ నదిని హిందువులు ఎంతో పవిత్రమైనదిగా భావించి నిత్య పూజలు చేస్తుంటారు.

Telugu Ganga River, Meet, Yamuna River-Telugu Bhakthi

అదేవిధంగా సూర్యుని పుత్రిక యమునా శాపం వల్ల ఛాయాదేవి హిమాలయాల్లో నదిగా మారిందని పురాణాలు చెబుతున్నాయి.గంగా యమునా నది పక్కపక్కనే ప్రవహిస్తూ ఉండటం వల్ల వీటిని గంగా-యమునా అని పిలవడమే కాకుండా గంగానదికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారో యమునా నదికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తున్నారు.గంగా నదికి ఎడమ వైపున పుట్టి కుడి వైపు ప్రవహించే ఏకైక ఉపనదిగా యమునా నదిని భావిస్తారు.ఋగ్వేదంలోనూ ఈ నది ప్రస్తావన ఉంది.ఈ నదికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.ఈ పుష్కరాలు 12 రోజులపాటు ఎంతో ఘనంగా జరుగుతాయి.

ఈ పుష్కరాలలో భాగంగా లక్షల సంఖ్యలో భక్తులు ఈ నదిలో స్నానమాచరించి యమునా నదికి పూజలు నిర్వహిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube