ఉత్త‌మ్‌కు కాంగ్రెస్ పెద్ద‌పీట‌.. కాక‌పోతే ఆయ‌న‌కు ఆ శ‌క్తి ఉందా...?

తెలంగాణ కాంగ్రెస్‌ను రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి త‌న భుజాల‌పై మోస్తున్నాడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి.మొద‌టి నుంచి ఆయ‌న కాంగ్రెస్‌లో గాంధీ కుబుంబానికి అత్యంత విధేయుడిగా న‌డుచుకుంటున్నారు.

 Congress Plan For Uttam Kumar Reddy, Uttam Kumar Reddy, Congress, Telangana Pcc-TeluguStop.com

గాంధీ కుటుంబం ఏ బాధ్య‌త ఇచ్చినా దాన్ని అత్యంత విన‌య విధేయ‌త‌తో చేస్తూ వ‌స్తున్నారు.అయితే కొన్నిసార్లు ఆయ‌న పార్టీని న‌డిపించ‌డంలో విఫ‌ల‌మ‌యిన‌ప్ప‌టికీ ఆయ‌న చిత్త‌శుద్దిని చూసిన గాంధీ కుటుంబం ఆయ‌న‌కు పార్టీలో పెద్ద‌పీట వేసేందుకు ట్రై చేస్తోంది.

ఎలాగూ ద‌క్షిణ భార‌త‌దేశానికి కూడా కాంగ్రెస్ ఎంతో మేలు చేస్తోంద‌ని నిరూపించుకోవ‌డంలో కూడా ఇది భాగ‌మ‌వుతుంద‌ని వారు భావిస్తున్నారు.

ఇప్పుడు ఆయ‌న్ను పీసీసీ నుంచి తొల‌గించి ఆ స్థానాన్ని ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి అప్ప‌గించ‌డంతో ఆయ‌న ఇప్పుడు ఖాలీ అయ్యారు.

ఇదే క్ర‌మంలో ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ లోక్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి స్థానంలో ఇంకొక‌రిని పెట్టి గ‌ట్టిగా పోరాడాల‌ని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.ఇందుకోస‌మే చాలామంది పేర్ల‌ను ప‌రిశీలిస్తోంది.

అయితే ఈ స్థానంలో కొత్త వారిని నియమించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారంట‌.ఇందుకోసం అనేక ర‌కాల పేర్ల‌ను ప‌రిశీలించ‌గా అందులో కేవ‌లం కొంద‌రి పేర్లు లిస్టులో మిగిలిన‌ట్టు తెలుస్తోంది.

ఎలాగూ జులై 19నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేప‌థ్యంలో అప్ప‌టి వ‌ర‌కు ఎలాగైనా ఈ స్థానాన్ని భ‌ర్తీ చేయాల‌ని చూస్తున్నారు.ఇందులో ముఖ్యంగా శశిథరూర్, మనీశ్ తివారీ పేర్లున వినిపిస్తుండ‌గా వారికి ఇత‌ర ప‌దువులు కూడా ఉండ‌టంతో కొత్త‌గా గౌరవ్ గొగొయి, రన్వీత్ సింగ్ బిట్టూ, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లు తెర‌మీద‌వ‌కు వ‌స్తున్నాయని తెలుస్తోంది.

Telugu Adhir Ranjan, Congress, Congressuttam, Rahul, Revanth Reddy, Telangana Pc

అయితే కాంగ్రెస్‌లో ఒక‌రికి ఒక ప‌దవి మాత్ర‌మే ఉండాల‌నే రూల్ ఇప్ప్ఉడు చాలా గ‌ట్టిగా ఉండ‌టంతో అధిర్ రంజన్ చౌదరిని క‌చ్చితంగా ఆ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.ఆయ‌న ఇదివ‌ర‌కే బెంగాల్ పీసీసీ అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు.ఇక ఆయ‌న ప్లేస్‌లో ఉత్త‌మ్ పేరు బ‌లంగా ఉండ‌టంతో రీసెంట్‌గా ఆయ‌నతో రాహుల్ కూడా చ‌ర్చ‌లు జ‌రిపినట్టు తెలుస్తోంది.కానీ ఉత్త‌మ్‌కు ఇదివ‌ర‌కు పెద్ద‌గా పార్ల‌మెంట్‌లో పార్టీని న‌డిపించిన స్త‌తా లేక‌పోవ‌డం కొంత మైన‌స్‌గా మారుతోంది.

మ‌రి పార్టీ ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఉంచి నియ‌మిస్తుందా లేదా అన్న‌ది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube