షూటింగ్ కి లేట్ గా వచ్చి సినిమా రిలీజ్ ని లేట్ చేసిన రాజశేఖర్.. ఏ సినిమానో తెలుసా.. ?

ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య హీరో రాజశేఖర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.పెళ్లిగోల సినిమా తర్వాత పోకూరి బాబురావుతో కలిసి అన్న సినిమా ప్లాన్ చేశాడు.

 Movie Release Issues With Hero Rajasekhar By Mutyala Subbaiah, Rajasekhar, Direc-TeluguStop.com

ఇందులో హీరోగా రాజశేఖర్ ను ఎంపిక చేశాడు.హీరోయిన్లుగా రోజా, గౌతమిని ఓకే చేశాడు.

అదే సమయంలో ఈ చిత్రంలో మరికొన్ని క్యారెక్టర్ల విషయంలో బాబురావు, సుబ్బయ్య మధ్యన వాదన జరిగింది.ఎర్రమందారం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కుమారుడిగా నటించిన పోకూరి రామారావు అబ్బాయిని అన్న సినిమాలో రాజశేఖర్ తమ్ముడి క్యారెక్టర్ చేయించాలని బాబురావు అన్నాడు.

కానీ బాలాదిత్యను తీసుకోవాలని సుబ్బయ్య పట్టుబట్టారు.కానీ చివరకు సుబ్బయ్య మాటే నెగ్గింది.

బాలాదిత్యను ఆ క్యారెక్టర్ కు ఎంపిక చేశారు.

కొద్ది రోజుల్లోనే అన్న సినిమా షూటింగ్ మొదలయ్యింది.

అయితే ఈ సినిమా షూటింగ్ కు రాజశేఖర్ ప్రతిరోజు ఆలస్యంగానే వచ్చేవాడు.ఎందుకు అని అడిగితే ఆరోగ్యం బాగాలేదు అనేవాడట.

అందుకే దర్శకనిర్మాతలు ఏమీ అనేవారు కాదట.పొద్దున్నే షూటింగ్ కు వెళ్లి.

రాజశేఖర్ లేని సీన్లను చిత్రీకరించేవారట.అనంతరం హీరో కోసం వెయిట్ చేసేవారట.కేవలం రాజశేఖర్ మూలంగానే ఆ సినిమాకు ఎక్కువ రోజులు పనిచేయాల్సి వచ్చిందట.100 రోజులకు పైగా ఈ సినిమాకు వర్క్ చేశారట.

Telugu Angarakshakudu, Anna, Ks Ramarao, Rajasekhar, Unhealthy-Telugu Stop Exclu

అదే సమయంలో రాజశేఖర్ కెఎస్ రామారావు సినిమా అంగరక్షకుడులో నటిస్తున్నాడు.అయితే అన్న సినిమా కంటే ఆ సినిమాకు రాజశేఖర్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడని సుబ్బయ్య వెల్లడించాడు.

అటు అన్న షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్ లోనే జరిగినట్లు సుబ్బయ్య చెప్పాడు.అయితే సినిమా ఫ్లాష్ బ్యాక్ మాత్రం మదుమలై అటవీప్రాంతంలో సెట్ వేసి తీసినట్లు చెప్పారు.

Telugu Angarakshakudu, Anna, Ks Ramarao, Rajasekhar, Unhealthy-Telugu Stop Exclu

పొద్దునే ఊటీ నుంచి వెళ్లి షూటింగ్ చేసుకుని మళ్లీ ఊటీకి వచ్చేవారు.ఓ రోజు కారులో వెళ్తుండగా తమ కారుకు ఒంటరిగా తప్పిపోయిన ఏనుగు అడ్డు వచ్చిందట.అది కోపంతో ఊగిపోతుందట.దాన్ని చూడగానే కారులో ఉన్న సుబ్బయ్య సహా సిబ్బందికి ఫుల్ టెన్షన్ వచ్చిందట.దాదాపు 45 నిమిషాల పాటు ప్రాణాలు అర చేతిలో పెట్టుకున్నారట.ఇంతలో ఫారెస్ట్ గైడ్స్ అక్కడికి రావడంతో ఏనుగు పారిపోయిందట.

అటు అన్న సినిమా విడుదలై వంద రోజులు ఆడిందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube