హీరో విజయ్ చెల్లి అలా చనిపోయారట.. బాధతో ఏడాది పాటు..?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.తమిళ ప్రేక్షకులకే కాకుండా తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకొని అభిమాన హీరోగా నిలిచాడు.

 Tamil Hero Vijay Sister Vidya Died Like That, Hero Vijay, Sister Dead, Tamil He-TeluguStop.com

బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విజయ్ ఆ తర్వాత తన తొలి సినిమాతో యాక్షన్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.అలా వరుస సినిమాలలోనటించి స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇక ఈయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే విజయ్ చెల్లి చనిపోయిన తర్వాత ఎంతో విజయ్ ఎంతో బాధపడ్డాడట.

విజయ్ తల్లి పేరు శోభ.

సినీ గాయనీగా, రచయిత్రిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక తన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ మంచి దర్శకుడిగా నిలిచాడు.

ఇక వీరికి విజయ్, విద్య లు జన్మించారు.విజయ్ కు తన చెల్లి విద్య అంటే ఎంతో ప్రాణం.

ఇక వీరిద్దరు కలిస్తే ఆ ప్రపంచమే వేరు అన్నట్లు ఉండేదని శోభ తెలిపింది.విజయ్ బడికి వెళ్లి వచ్చాక తన చెల్లి చుట్టే తిరిగేవాడట.

తనతో పాటు విజయ్ కూడా తన చెల్లికి స్నానం చేయించేవాడట.అన్నం తినిపించేవాడట.

Telugu Vijay Sister, Chandra Sekhar, Vijay, Kollywood, Mother Shobha, Sister, Si

ఇక అప్పుడప్పుడు విజయ్ చేసే అల్లర్లు సరదాగా ఉండేవని.ఇంటి బయట గేటు నుంచి రాకుండా వెనకవైపు కిచెన్ కిటికీలోనుంచి దూకి తన తనతో పాటు చెల్లిని సరదాగా భయపెట్టేవాడని తెలిపింది.అలా రోజు కిటికీలో నుండి దూకినా విజయ్ కి ఓ రోజు ఎవరూ కనిపించలేదని.తను విద్యతో పాటు బెడ్ రూమ్ లో ఉండగా తన చెల్లి నీరసంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేక పోయాడని తెలిపింది.

మరుసటి రోజు వైద్యులు వచ్చి వెళ్ళాక బెడ్ రూమ్ నుండి తను కిందికి వచ్చి.విజయ్ ను ఒకసారి చెల్లెల్ని చూసిరా అని పంపించే సరికి నిర్జీవంగా ఉన్న చెల్లెను చూసి విజయ్ గట్టిగా విద్య అంటూ అరిచాడు.

Telugu Vijay Sister, Chandra Sekhar, Vijay, Kollywood, Mother Shobha, Sister, Si

ఇక తన చెల్లి మరణాన్ని తట్టుకోలేక ఆ తర్వాత తను మాట్లాడడం మానేశాడు.చెల్లెలి కోసం ఏడుస్తూ ఉండేవాడు.అలా బాధపడుతూ ఏడాది వరకు తనలో మార్పులు వచ్చాయని.వయసుకు మించిన నెమ్మదితనం వచ్చిందని.విద్య చనిపోయిన ఏడాది తర్వాత తాను నవ్వడానికి కారణం సినిమాలని తెలిపింది.ఇక విజయ్ కి సినిమాల పట్ల ఎక్కువగా ఇష్టం ఉండటంతో తన తండ్రి విజయ్ కోసం ఎంతో కష్టపడ్డాడని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తల్లిదండ్రులు విజయ్ కు సంబంధించిన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube