ఆ బెడ్ సీన్ వల్ల ఏడ్చిన తెలంగాణ శకుంతల.. ఏం జరిగిందంటే..?

ఇ.వి.వి.సత్యనారాయణ డైరెక్షన్ లో తెరకెక్కి 2005 సంవత్సరంలో విడుదలైన ఎవడిగోల వాడిది సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కడప రెడ్డెమ్మ పాత్రలో తెలంగాణ శకుంతల నటించగా ఆమె భర్త గౌరీ శంకర్ పాత్రలో కృష్ణభగవాన్ నటించారు.ప్రముఖ సినీ నటి జ్యోతి ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలో ఇబ్బందిగా ఉన్న సీన్లు ఉంటే ఆ సీన్లను మార్చమని చెబుతానని జ్యోతి పేర్కొన్నారు.

 Bad Experience For Telangana Shakuntala In Evadi Gola Vadidi Movie,latest News T-TeluguStop.com

ఇ.వి.వి.గారు సినిమాలోని నటులకు క్యారెక్టర్ చెప్పరని జ్యోతి తెలిపారు.ఎవడి గోల వాడిది మూవీ షూటింగ్ కోసం 25 రోజులు బ్యాంకాక్ కు వెళ్లామని ఆ సమయంలో తెలంగాణ శకుంతలకు కూడా ఇ.వి.వి.సత్యనారాయణ గారు క్యారెక్టర్ చెప్పలేదని జ్యోతి అన్నారు.ఆ సమయంలో తెలంగాణ శకుంతల ఎక్కువగా రెబల్ క్యారెక్టర్స్ చేసేవారని జ్యోతి పేర్కొన్నారు.ఆ సినిమాలో తెలంగాణ శకుంతల, కృష్ణభగవాన్ మధ్య బెడ్ సీన్ ఉందని ఆ సీన్లు కామెడీగా ఉన్నా ఆ సీన్ చేసే సమయంలో తెలంగాణ శకుంతల కన్నీళ్లు పెట్టుకున్నారని జ్యోతి తెలిపారు.

బెడ్ సీన్ లాంటి సీన్ తాను గతంలో చేయలేదని ఆ సీన్ చేయడానికి తనకు కంఫర్ట్ గా లేదని డైరెక్టర్ కు చెప్పుకోలేక తెలంగాణ శకుంతల బాధ పడ్డారని జ్యోతి చెప్పారు.ఆ పాత్రను రిజెక్ట్ చేస్తే అక్కడినుంచి వెళ్లేది ఎలా.? అని తెలంగాణ శకుంతల ఆలోచించారని జ్యోతి చెప్పుకొచ్చారు.మ్యారేజ్ అయిన వాళ్లు పిల్లలను దృష్టిలో ఉంచుకుని పాత్రలు ఎంచుకోవాల్సి వస్తుందని జ్యోతి తెలిపారు.

తనకు ఏదైనా సీన్ కంఫర్ట్ లేకపోతే వెంటనే డైరెక్టర్ తో ఆ విషయం చెప్పేస్తానని జ్యోతి చెప్పుకొచ్చారు.కితకితలు సినిమాలో తనకు వ్యాంప్ రోల్ ఇచ్చారని తనకు పాత్ర నచ్చకపోవడంతో ఆ పాత్రను రిజెక్ట్ చేశానని ఆ తర్వాత ఇ.వి.వి సత్యనారాయణ సినిమాలో తనకు ఛాన్స్ రాలేదని జ్యోతి వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube