కళ్లజోడు మొహం బోర్ కొట్టింది.. అందుకే అమీర్ విడాకులు ఇచ్చాడు!

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పేరు ప్రస్తుతం వార్తల్లో బాగా హాట్ టాపిక్ గా మారింది.రెండు రోజుల కిందట తన రెండో భార్య కిరణ్ రావుకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

 Krk Sensational Comments On Aamir Khan Kiran Rao Divorce, Aamir Khan First Wife,-TeluguStop.com

ఇక ఈ విషయం గురించి ప్రస్తుతం బాలీవుడ్ లో రకరకాల వార్తలు కూడా వినిపిస్తున్నాయి.దంగల్ మూవీ లో తనతో కలిసి ఆయన కూతురు గా నటించిన నటి ఫాతిమా సన షేక్ తో ప్రేమలో ఉండటంతో కిరణ్ రావుకు విడాకులు ఇచ్చినట్లు మారుమ్రోగుతోంది.

1986లో రీనా దత్త ను పెళ్లి చేసుకొని 2002లో ఆమెతో విడాకులు తీసుకున్నాడు.ఇక 2005లో కిరణ్ రావుని పెళ్లి చేసుకొని రెండు రోజుల కిందట విడాకులు తీసుకున్నాడు.ఇక ఈ విషయం గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ ట్రోల్స్ ఎదురవుతున్నాయి.ఇలా ఎందుకు వదిలిపెట్టారని తెగ ప్రశ్నలు వేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా మరో సినీ నటుడు క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ అలియాస్ కేఆర్కే కూడా ఈ విషయం గురించి స్పందించగా ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

తాజాగా తన యూట్యూబ్ ఛానల్ లో ఓ వీడియో షేర్ చేయగా.అందులో అమీర్ ఖాన్ నిజాయితీపరుడని అందరూ అంటుంటారు.కానీ ఆయన విడాకులు ఎందుకు తీసుకున్నారో నిజాయితీగా చెప్పాలంటున్నాడు కేఆర్కే ప్రశ్నించాడు.

అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో సాధారణ మహిళ అయిన కిరణ్ రావును పెళ్లి చేసుకోవడం ఏంటని అప్పుడే అనుకున్నాడట ఈయన.ఎందుకంటే తను సూపర్ స్టార్ కాబట్టి తలుచుకుంటే స్టార్ హీరోయిన్స్ కత్రినా కైఫ్, ఫాతిమా సనా వంటి వారిని పెళ్లి చేసుకోవచ్చని అన్నాడు.

అంతేకాకుండా కిరణ్ రావు లుక్ గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు.కళ్ళజోడు లేకపోతే ఆమెను కనీసం చూడలేము అంటూ, సర్వసాధారణమైన ఆమెను అమీర్ పెళ్లి చేసుకున్నాడు అంటే విని షాక్ అయ్యాడట.అంతేకాకుండా ఆమెనే ఎందుకు పెళ్లి చేసుకున్నాడని బాధపడ్డాడట.ఇక ఆయన డబ్బు మనిషి కాదని తన మొదటి భార్యకు విడాకులు సమయంలో ఎలాంటి డబ్బు చెల్లించకుండానే ఆ బంధాన్ని విడిపించుకున్నాడని, ఇప్పుడు ఆయనకు డబ్బు కొరత లేదంటూ కచ్చితంగా కిరణ్ రావుకు భరణం చెల్లించాల్సిందే అని తెలిపాడు.

ఇక ఆయన నిజాయితీగా విడాకుల విషయం గురించి చెప్పాలంటూ.కిరణ్ రావు కళ్ళద్దాల మొహం చూడలేకపోతున్నానని, 15 ఏళ్ళు ఆమెను చూసి బోర్ కొట్టడం వల్ల విడాకులు తీసుకున్న నిజం ఒప్పుకోవాలంటూ గట్టిగా తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube