వామ్మో.. ఆ స్విమ్మింగ్ ఫూల్ లోతు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

స్విమ్మింగ్ పూల్స్​ ఎంత లోతుంటాయి.మహా అయితే 20 నుంచి 30 అడుగులు.

 If You Know The Depth Of The Swimming Pool Of Dubai Should Be Shocked , Swimming-TeluguStop.com

ఇంకా ఎక్కువ అనుకుంటే 70‌‌‌‌–80 అడుగుల లోతు ఉండే స్విమ్మింగ్ పూల్స్ గురించి మనం విన్నాం.కానీ ఏకంగా 196 అడుగుల లోతు ఉన్న స్విమ్మింగ్​ పూల్​ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ? మీ సమాధానం ‘లేదు’ కదా.అవును చాలా మందికి ఇంత లోతులో ఓ స్విమ్మింగ్ ఫూల్​ గురించి తెలియదు.

ఆ స్విమ్మింగ్​ ఫూల్ ఎక్కడుంది.

ఎలా ఉంటుంది.దాని ప్రత్యేకతలేంటి వంటి వివరాలను చక చక తెలుసుకుందామా ? అయితే పదండి ముందుకు.దుబాయ్​లోని నాడ్​ అల్​ షెబాలో ఉందీ స్విమ్మింగ్ ఫూల్​.అక్కడి ప్రభుత్వం దీనిని నిర్మించింది.196 అడుగులు ఉండే ఈ స్విమ్మింగ్ ఫూల్​లో ఎన్నో విశేషాలు ఉన్నాయి.

డీప్​ డైవ్​ దుబాయ్​ అనే పేరుతో ప్రపంచంలోనే అత్యంత లోతైన స్విమ్మింగ్ ఫూల్​ను దుబాయ్​ ప్రభుత్వం ఇటీవలే నిర్మించింది.

దీనిని ఆ దేశ యువరాజు హమ్​ధన్​ బిన్​ బుధవారం ప్రారంభించి, ఆ స్విమ్మింగ్​ ఫూల్​ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన జలపాతం అని తెలిపారు.

ఇందులో 60 మీటర్ల లోతుతో నిర్మించామని చెప్పారు.

Telugu Cameras, Meters Depth, Dubai, Dubai Pool, Garage, Hamdan Bin, Pool, World

ఇందులో ఓ అద్భుత నగరం ఉంటుందని తెలిపారు.ఆపార్ట్​మెంట్​తో పాటు గ్యారేజ్​ వంటి నిర్మాణాలను ఏర్పాటు చేశామని మీడియాకు వివరించారు ఆ దేశ యువరాజు.ఇందులో 56 కెమెరాలు ఉన్నాయని, ఈ స్విమ్మింగ్​ ఫూల్​లో డైవ్​ చేసే వారి కదలికలను ఇవి ఎప్పకటిప్పుడు గమనిస్తూ ఉంటాయని పేర్కొన్నారు.

ఇందులో ఆటలు కూడా ఆడుకోవచ్చని తెలిపారు.

Telugu Cameras, Meters Depth, Dubai, Dubai Pool, Garage, Hamdan Bin, Pool, World

అయితే ఇందులో 1.4 కోట్ల నీరు అవసరం అవుతుందని, ఈ నీటిని ప్రతీ ఆరు గంటలకు ఒక సారి శుద్ధి చేస్తామని తెలిపారు.ఈ నీటిని శుద్ధి చేసేందుకు అధునాత టెక్నాలజీని వాడుతున్నామని పేర్కొన్నారు ఆ దేశ యువరాజు.

అయితే ఇది ప్రస్తుతం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదని, కొంత మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube