ఇదేం విడ్డూరం: పొలంలోని బావి మాయం.. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన రైతు..!

ఈ మధ్యన విచిత్ర కేసులనేవి నమోదవుతూ ఉన్నాయి.తాజాగా అలాంటి ఓ విచిత్ర కేసే పోలీస్ స్టేషన్ లో నమోదైంది.

 Farmer Gave Police Complaint Over Vanishing The Well From His Filed , Karnataka,-TeluguStop.com

పొలంలో తవ్విన బావి కనిపించడం లేదని కేసు నమోదైంది.ఆ బావి కూడా ఈ మధ్యనే కనిపించడం లేదంటూ కర్ణాటకలోని ఓ రైతు పోలీసులను ఫిర్యాదు చేశాడు.

బావి కనిపించలేదని దయచేసి దానిని వెతికిపెట్టాలని వినతి చేసుకున్నాడు.తమ పొలంలో బావి కనిపించకుండా పోయిందని ఆ రైతు కేసు పెట్టడం ఇప్పుడొక హాట్ టాపిక్ అయ్యింది.

ఇంతకీ అసలు కథ ఏంటంటే.బెళగావి జిల్లాలోని మావిన హోండ గ్రామానికి చెందిన మల్లప్ప రామప్ప అనే రైతు ఉండేవాడు.

ఆయన తన కుమారులతో కలిసి రాయబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 3వ తేదిన రాతపూర్వకంగా కేసును పెట్టాడు.తన బావికి సంబంధించి ప్రభుత్వ అధికారులను కూడా కలిసి తన బాథను చెప్పుకున్నాడు.

ఆ రైతు పెట్టిన కేసును చూసి పోలీసులు కూడా షాక్ తిన్నారు.ఆ రైతు ఉండే పంచాయితీలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.రైతు మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్లు రికార్డు సృష్టించి ఉందని, అయితే అవి ప్రభుత్వ నిధులు కాజేయడానికి చేసిందేనని వారు తేల్చారు.ఉపాధి హామీ పథకం కింద ఈ బావిని తవ్వేందుకు రూ.77,000 వ్యయం చేసినట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది.బావిని తవ్వేందుకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా కేవలం ఫేక్ బిల్లులతోనే డబ్బులు పొందిన వైనం బయటపడింది.

Telugu Complaint, Gave Complaint, Filed, Karnataka, Well-Latest News - Telugu

విషయం తెలుసుకున్న రైతు మల్లప్ప పంచాయితీ అధికారులకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు.ప్రభుత్వ రికార్డుల్లో కనిపిస్తున్న బావి తన పొలంలో ఎందుకు కనిపించడం లేదంటూ కేసు పెట్టడం వలన పంచాయితీ అధికారులకు బుద్ది చెప్పినట్లు అయ్యింది.ల40 ఏళ్లుగా తమ పొలంలో ఓకే ఒక్క బావి ఉందని రైతు మల్లప్ప తెలుపుతూనే మరొ కొత్త బావి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు.రికార్డుల్లో చూపిస్తున్న బావిని పోలీసులు, అధికారులు వెతికిపెట్టాలని వేడుకోవడంతో ఈ వాస్తవం బయటపడింది.

ప్రస్తుతం దీనిపై కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube