తుమ్మలను టీఆర్ఎస్ లో అణచివేస్తున్నారా?

తుమ్మల నాగేశ్వర రావు. రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ హావా కొనసాగినప్పటి నుంచి ఈయనకు ఎదురే లేకుండా పోయింది.

 Suppressing Squirrels In Trs Over Thummala Nageswara Rao, Thummala, Trs, Politic-TeluguStop.com

తెలుగుదేశంలో ఓ వెలుగు వెలిగిన తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ వచ్చిన తర్వాత గులాబీ గూటికి చేరారు.తుమ్మల కారెక్కాక… ఖమ్మంలో టీఆర్ఎస్ కు తిరుగే లేకుండా పోయింది.

అంతకు ముందు వరకూ… టీఆర్ఎస్ నూ కేసీఆర్ ను పెద్దగా పట్టించుకోని ఖమ్మం ప్రజలు తుమ్మల చేరిక తర్వాత అక్కున చేర్చుకున్నారు.నిర్వహించిన ప్రతి ఎన్నికలోనూ కారుకు భారీ మెజారిటీ కట్టబెడుతున్నారు.

అలా ఖమ్మంలో పార్టీని విజయపథాన తీసుకెళ్తున్న తుమ్మల నాగేశ్వర రావుకు సీఎం కేసీఆర్ కూడా తగిన ప్రాధాన్యం ఇచ్చారు.కానీ రాను రాను తుమ్మల కు పార్టీలో ప్రాతినిథ్యం తగ్గిందట.

ఖమ్మం కోటలో టీఆర్ఎస్ పాగా వేసేందుకు కారణమైన తుమ్మలను ప్రస్తుతం టీఆర్ఎస్ లో పక్కన పెడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.దీంతో తీవ్ర ఆవేదనలో ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు వేరే పార్టీలో చేరాలని చూస్తున్నట్లు కూడా చర్చ జరుగుతోంది.

ఒక వేళ… పార్టీ మారితే కలిగే ప్రయోజనాలను గురించి తన ఆప్తుల వద్ద తుమ్మల నాగేశ్వర్ రావు చర్చించినట్లు వినికిడి.అంతలా రాజకీయాలను శాసించిన నేతను గులాబీ పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం సరికాదని తుమ్మల అభిమానులతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు.

Telugu @ktrtrs, Kcr Thummala, Khammam, Trs, Ts-Telugu Political News

ఇక కాంగ్రెస్ పార్టీ కొత్త పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాకతో మంచి ఊపు మీద ఉంది.రేవంత్ రెడ్డి కూడా రాజకీయ ఓనమాలు నేర్చింది తెలుగుదేశం పార్టీలోనే.తుమ్మల నాగేశ్వర్ రావు కూడా టీఆర్ఎస్ లో చేరక ముందు తెలుగుదేశంలోనే ఉన్నారు.ఈ మైత్రితోనే రేవంత్ రెడ్డి పక్షాన ఆయన చేరుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఏదేమైనా 2023లో సార్వత్రిక ఎన్నికలుండగా.ఇప్పటి నుంచే వేడి పుడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube