సీరియల్స్‌లో కన్నీళ్లు ఎందుకు పెట్టుకుంటారో చెప్పేసిన సుమ?

టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ పరిచయం గురించి ఎంత చెప్పినా తక్కువే.ఎందుకంటే బుల్లితెరలో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు.

 Star Anchor Suma Told Why Actors Shed Tears In Serials, Anchor Suma , Serials, C-TeluguStop.com

ఎన్నో షోలలో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో ఉన్న సుమ మొదట నటిగా కొన్ని సినిమాలలో నటించగా ఆ తర్వాత యాంకరింగ్ గా పరిచయం అయింది.

ఇక యాంకరింగ్ ఫీల్డ్ నుండి ఇప్పటివరకు మళ్లీ ఎందులో కూడా అడుగు పెట్టలేదు.అలా ఎన్నో షో లలోనే కాకుండా సినీ అవార్డ్ ఫంక్షన్స్, ఆడియో ఫంక్షన్స్ లో కూడా తన యాంకరింగ్ తో బాగా మెప్పిస్తుంది.

ఇక తన షో కి వచ్చిన ఏ గెస్టులతో నైనా ఓ రేంజ్ లో ఆట ఆడుకుంటుంది.అంతేకాకుండా వారి నోటితోనే వాళ్ల గురించి చెప్పేలా చేస్తుంది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది సుమ.ఇటీవలే తన యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించింది.

ఇక ప్రస్తుతం బుల్లితెరలో పలు షో లలో బాగా బిజీగా ఉంది.ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షోలో సుమ పంచ్ లతో బాగా సందడి చేస్తుంది.

తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో బుల్లితెర నటులు తేజస్విని, మోనిషా, సుహాసిని, వైష్ణవి గెస్ట్ లుగా పాల్గొన్నారు.

ఇక వారితో బాగా సందడి చేస్తూ షో ను ప్రారంభించగా అందులో సినీ నటి సుహాసిని కథలో హీరోయిన్స్ ఎప్పుడు నవ్వుతూ, సంతోషంగా ఉంటే ప్రేక్షకులు చూడడం లేదని.హీరోయిన్స్ ఏడుస్తుంటేనే చూడటానికి ఇష్టపడుతున్నారని సరదాగా చెప్పడంతో వెంటనే సుమ ఆ పాయింట్ అందుకొని సీరియల్స్ లో కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం మీరే అంటూ బుల్లితెర ప్రేక్షకులపై ఒక కామెంట్ చేసింది.

మీ వల్లే హీరోయిన్స్ ఏడుస్తున్నారు అంటూ సరదాగా అనేసింది.అనంతరం వీరితో సరదాగా కొన్ని టాస్క్ లు చేయించింది.అంతేకాకుండా ఫన్నీ కౌంటర్ లతో వాళ్లని ఓ ఆట ఆడుకుంది సుమ.ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube