పెళ్లి చేసుకున్న జబర్దస్త్ వినోద్.. భార్య ఎవరంటే..?

బుల్లితెర జబర్దస్త్ షో ద్వారా పరిచయమైన కమెడియన్లకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో మంచి గుర్తింపుతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉన్న సంగతి తెలిసిందే.జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ వినోద్ ఒకరు.

 Jabardast Vinod Marriage Photos Goes Viral In Social Media, Jabardast Vinod, Jab-TeluguStop.com

తాజాగా వినోద్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా “మీట్ మై వైఫ్ విజ్జు” పేరుతో వినోద్ ఒక వీడియోను షేర్ చేశారు.వినోద్ తో వినోదం పేరుతో యూట్యూబ్ ఛానల్ ను స్టార్ట్ చేసిన వినోద్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ వేయడం ద్వారా వినోద్ పాపులారిటీని సంపాదించుకున్నారు.ఈ వీడియోలో పెళ్లి గురించి, భార్య గురించి వినోద్ అభిమానులతో పంచుకోవడం గమనార్హం.తన భార్య పేరు విజయలక్ష్మీ అని తాను భార్యను విజ్జీ అని పిలుచుకుంటానని వినోద్ చెప్పుకొచ్చారు.విజయ లక్ష్మీ తన అత్త కూతురని తనది, విజయలక్ష్మిది కడప అని వినోద్ వీడియోలో వెల్లడించారు.

చిన్నప్పటి నుంచి తాను, విజయలక్ష్మి కలిసిమెలిసి పెరిగామని లాక్ డౌన్ లో ఎంతోమంది పెళ్లిళ్లు తాను చూశానని అయితే తన మ్యారేజ్ కూడా లాక్ డౌన్ లోనే జరిగిందని వినోద్ చెప్పుకొచ్చారు.మ్యారేజ్ లైఫ్ ఎలా ఉందని వినోద్ భార్యను అడగగా ఆమె మ్యారేజ్ లైఫ్ చాలా బాగుందని సమాధానం ఇస్తారు.వినోద్ ను పెళ్లి చేసుకోవడం తనకు గౌరవంగా ఉందని విజయలక్ష్మి వెల్లడించారు.

ఎక్కడున్నా తాను హ్యాపీగానే ఉన్నానని భర్తతో కలిసి ఉంటే తాను మరింత సంతోషంగా ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు.

కెమెరా ముందు తక్కువగా మాట్లాడుతున్నా కెమెరా ఆఫ్ అయితే మా ఆవిడ ఎక్కువ మాట్లాడుతుందని వినోద్ తెలిపారు.మమ్మల్ని ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని ఆశీర్వదించాలని వినోద్ అభిమానులను కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube