వామ్మో.. ఆర్ఆర్ఆర్ మూవీకి కీరవాణి రెమ్యునరేషన్ అన్ని కోట్లా..?

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు వేర్వేరు కారణాల వల్ల సినిమాలకు దూరమవుతున్నా కీరవాణి మాత్రం దశాబ్దాలుగా మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.సంగీతప్రియులకు కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

 Director Keeravani Remuneration For Rajamouli Rrr Movie, 16 Crore Rupees, Keer-TeluguStop.com

శాస్త్రీయ సంగీతం తెలిసిన కీరవాణి ఈ జానర్ ఆ జానర్ అనే తేడా లేకుండా అన్ని జానర్ సినిమాలకు సంగీతం అందించగల ప్రతిభ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం.

రాజమౌళి, కీరవాణి అన్నాదమ్ముల పిల్లలు కాగా ఇరువురి కుటుంబ సభ్యులు సినిమా రంగంలో మంచి గుర్తింపును సాధించారు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, హరిహర వీరమల్లు సినిమాలతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్ లకు కీరవాణి సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తోంది.ఆర్ఆర్ఆర్ మూవీకి కీరవాణి ఏకంగా 16 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వస్తుండగా ఆ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Telugu Crore Rupees, Keeravani, Rrr-Movie

పుట్టుకతోనే కీరవాణి కుటుంబం సంపన్న కుటుంబం అయినప్పటికీ ఒక సినిమాను నిర్మించడం వల్ల ఆ కుటుంబాన్ని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి.ఒక దశలో 20 మందికి పైగా ఉన్న కుటుంబాన్ని కీరవాణి పోషించారు.డబ్బు కోసం కథ నచ్చకపోయినా కొన్ని సినిమాలకు కీరవాణి సంగీతం అందించడం గమనార్హం.1990 సంవత్సరంలో కీరవాణి సంగీత దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టారు.

Telugu Crore Rupees, Keeravani, Rrr-Movie

మొదట్లో కీరవాణి సంగీతం అందించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.అయితే ఆ తరువాత కీరవాణి పాటలకు మంచి గుర్తింపు రావడంతో పాటు విజయాలు దక్కాయి.ఇతర భాషల్లో కూడా మ్యూజిక్ అందించిన కీరవాణి పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉండటం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ నేపథ్య సంగీతం కోసం కీరవాణి చాలా కష్టపడుతున్నారని సమాచారం.కీరవాణి మ్యూజిక్ వల్లే రాజమౌళి సినిమాలు ప్రేక్షకులను మరింత ఎక్కువగా ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube