లోకేష్ కు ఇక చెడుగుడే ? అక్కడ వైసీపీదే రాజ్యం ? 

పప్పు .మాలోకం, ఇంకా నోటికి ఏది వస్తే ఆ పేర్లతో రకరకాలుగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై వైసిపి నాయకులు తీవ్ర స్థాయిలో ఎప్పుడూ విమర్శలు చేస్తూనే ఉంటారు.

 Lokesh Is Worried About The Strength Of The Tdp In The Legislative Counsil, Nara-TeluguStop.com

వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలతో పాటు, టిడిపి, జనసేన కు చెందిన ఎమ్మెల్యేలు కొంత మంది మద్దతు పలుకుతుండడంతో వైసీపీదే ఇష్టారాజ్యంగా ఉంది.దీంతో ఆ స్థాయిలో లోకేష్, చంద్రబాబు పైన విరుచుకుపడుతూ ఉంటారు.

ఇక వైసీపీ ప్రభుత్వం పై లోకేష్ సైతం అంతే స్థాయిలో విమర్శలు చేసినా, వైసిపి నాయకులు ముందు అది తేలిపోతోంది.అయినా తన శక్తికి మించి లోకేష్ పోరాడుతూనే ఉన్నారు.

వైసిపి ఎంతగా హడావుడి చేసినా శాసనమండలి విషయానికి వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీదే హవా గా ఉండేది.

టిడిపికి చెందిన ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉండడం, మండలి చైర్మన్ సైతం టిడిపికి చెందిన వ్యక్తి కావడంతో వైసిపి బయట ఎంతగా హడావుడి చేసినా శాసనమండలిలో టిడిపిదే పైచేయిగా ఉంటూ వచ్చింది.

కీలకమైన ఎన్నో బిల్లులు శాసనసభలో ఆమోదం పొందినా, మండలిలో మాత్రం టిడిపి వాటిని అడ్డుకుంటూ వచ్చేది.ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం, మూడు రాజధానులతో పాటు, ఎన్నో కీలకమైన బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి.

ఆ విధంగా మండలిలో లోకేష్ తన ప్రతాపం చూపించేవారు.దీంతో అసలు మండలినే రద్దు చేసేందుకు జగన్ ప్రయత్నించినా, అది వర్కౌట్ కాలేదు.  కాకపోతే ఇప్పుడు శాసనమండలిలో వైసిపి బలం పెరిగింది.

Telugu Ap Cm, Chandrababu, Chinbabau, Jagan, Lokesh, Telugudesam, Ysrcp-Telugu P

మండలి చైర్మన్ గా వైసీపీ నేత రాబోతున్నారు.దీంతో ఇక లోకేష్ హవా ముగిసినట్టే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఖచ్చితంగా మండలిలో లోకేష్ ను టార్గెట్ చేసుకుని వైసిపి చెడుగుడు ఆడుకునేలా కనిపిస్తోంది.

బయట ప్రభుత్వంపై ఎంతగా విమర్శలు చేసినా, మండలిలో అనేక అంశాలలో లోకేష్ ను ఇరుకున పెట్టొచ్చు అనేది వైసిపి అభిప్రాయంగా కనిపిస్తోంది.ఎలాగూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న వైసీపీ మంత్రులు మండలి లో లోకేష్ కు గట్టి కౌంటర్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube