సింగర్ చిన్మయి ప్రెగ్నెంట్ అంటూ వార్త.. అసలు విషయం అలా?

టాలీవుడ్, కోలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద పరిచయం గురించి అందరికీ తెలిసిందే.తన అందమైన స్వరంతో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 Singer Chinmayi, Rumors, Pregnant, Given Clearity,latest News Viral-TeluguStop.com

అంతేకాకుండా ఇండస్ట్రీలో ముక్కుసూటి అమ్మాయిగా నిలిచింది.ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

కానీ తనకు సంబంధించిన విషయాలతో కాకుండా సమాజం పట్ల జరిగే అన్యాయాల గురించి బాగా ఫైర్ అవుతుంది.మహిళల భద్రత గురించి ఎన్నో విషయాలు పంచుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Clearity, Pregnant, Rumors, Chinmayi-Movie

ఇక ఈమె సినీ నటుడు రాహుల్ రవీంద్రన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తన భర్త గురించి చాలాసార్లు పంచుకుంది.ఇక ఇటీవలే తన భర్త సోదరుడు రోహిత్ రవీంద్రన్ వివాహం జరుగగా ఆ సందర్భంగా అక్కడ దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది చిన్మయి.

ఇక అందులో ఓ ఫోటోలో తన కడుపు ఎత్తుగా కనిపించడంతో ఆమె గర్భం దాల్చిందని తెగ వార్తలు వినిపించాయి.ఇక ఈ వార్త చిన్మయి దృష్టి వరకు చేరుకోగా తాజాగా ఈ విషయం గురించి స్పందించింది.

ఇక తను తన పెళ్లికి సంబంధించిన త్రో బ్యాక్ ఫోటో షేర్ చేస్తూ.పెళ్లిలో ముడిసారీతో తనకు సమస్యలు ఉన్నాయని దానివల్ల కడుపు భారీగా కనిపించేలా అనిపించడంతో మీకు అలా కనిపించి ఉండొచ్చని తెలిపింది.కాని తాను గర్భవతి కాదని క్లారిటీ ఇచ్చింది.ఇక యూట్యూబ్ లో చిన్మయి బేబీ బంప్ అంటుంటే తను చాలా విసిగి పోయిందట.నిజానికి ఆ ఫోటో తప్పు కోణంలో తీసినట్లు తెలిపింది.

తన చీర చాలా వదులుగా ఉందని.

అయినా తన వ్యక్తిగత జీవితం పంచుకోనని తెలిపింది చిన్మయి.సోషల్ మీడియాలో తన ఎంత యాక్టివ్ గా ఉన్న తన వ్యక్తిగత విషయాలను పంచుకోనని క్లారిటీ ఇచ్చింది.

సమయం వచ్చినప్పుడు గర్భధారణ సంబంధించిన విషయాన్ని చెప్పచ్చు లేదో చెప్పకపోవచ్చు అంటూ తెలిపింది.ఇలాంటి మాటలతో తాను అలసిపోయాను అంటూ దయచేసి ఆపండి అంటూ ఫైర్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube