హుజూరాబాద్ అభ్యర్థి గెలుపులో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించనుందా?

హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా ఉన్న విషయం తెలిసిందే.దుబ్బాక ఉప ఎన్నిక తరహాలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా రసవత్తరంగా కొనసాగుతొంది.

 Will Social Media Play A Key Role In Huzurabad Candidate's Victory, Huzurabad By-TeluguStop.com

ఒకప్పుడు ఎన్నికలలో గెలుపొందడానికి ప్రచారం కీలక పాత్ర పోషించేది.కాని ఇప్పుడు ప్రచారంలో సోషల్ మీడియాఅనేది కీలక పాత్ర పోషిస్తోంది.

అధికార ప్రతిపక్షాల మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోంది.దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు గెలుపొందడానికి టీఆర్ఎస్ ఓడిపోవడానికి సోషల్ మీడియా అనేది కీలక పాత్ర పోషించింది.

అయితే ఈ హుజూరాబాద్ ఎన్నికలో కూడా సోషల్ మీడియా అనేది కీలకపాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బీజేపీ నాయకులపై రకరకాల సందర్భాలను ప్రస్తావిస్తూ ఎన్నికల వాడీ వేడిని మొదలుపెట్టాయని మనం భావించవచ్చు.

అయితే బీజేపీకి నియోజకవర్గంలో ఈటెల వ్యక్తిగత బలం మినహా బీజేపీ పార్టీకి పెద్దగా బలం లేదు.అందుకే సోషల్ మీడియానే ఎక్కువగా ప్రయోగిస్తుంది బీజేపీ.

ప్రజల అబిప్రాయాలను అక్కడ ఓటర్లను ప్రభావితం చేసేలా రకరకాలుగా వ్యంగ్యాస్త్రాలుగా సంధిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.కాని ప్రజల నాడీ పట్టుకోవడంలో పార్టీలు సైతం విఫలమవుతున్నాయి.

ఏది ఏమైనా హుజూరాబాద్ ఉప ఎన్నిక రణరంగాన్ని తలపించేలా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube