స్టూడెంట్ వీసాలో యూకే కొత్త విధానం...భారత విద్యార్ధులకు మంచి అవకాశమంటున్న నిపుణులు..!!!

యూకే విదేశీ విధ్యార్ధులను ఆకర్షించడానికి గత కొన్నేళ్లుగా పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తూ విధ్యార్ధులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.వివిధ దేశాల నుంచీ ఎంతో మంది విద్యార్ధులు ఎక్కువగా అమెరికా వెళ్లి చదువుకుని స్థిరపడాలని భావిస్తూ ఉంటారు.

 Uk New Student Visa - New Graduate Immigration Route Benefit Indian Student , V-TeluguStop.com

అయితే అక్కడ విధిస్తున్న వీసా నిభందనలకు ప్రస్తుతం అమెరికా వెళ్లి చదువుకునే వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది.దాంతో విధ్యార్ధులను ఆకర్షించడానికి, ముఖ్యంగా భారత విధ్యార్ధులను తమ దేశంలో అడుగుపెట్టేలా చేయడానికి యూకే ప్రభుత్వం ఆరాట పడుతోంది.

ఈ క్రమంలోనే యూకే తమ స్టూడెంట్ వీసా విధానంలో నూతన వొరవడిని తీసుకువచ్చింది.కొన్ని నిభందనలు సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.దాంతో భారత విద్యార్ధులకు యూకే తీసుకున్న నిర్ణయం వరం గా మారనుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.గ్రాడ్యుయేట్ ఇమ్మిగ్రేషన్ రూట్ అనే విధానం ద్వారా తమ దేశంలో చదువు పూర్తి చేసుకున్న విదేశీ విద్యార్ధులు మరో రెండేళ్ళ పాటు అక్కడే ఉద్యోగం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.

ఈ విధానాన్ని యూకే మంత్రి ప్రీతి పటేల్ అధికారికంగా ఆవిష్కరించారు.ఈ విధానం ద్వారా తమ స్కిల్స్ ను బట్టి మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

మరొక విషయం ఏమిటంటే.

Telugu Graduate Route, Uk, Uk Preity Patel, Visa-Telugu NRI

ఈ గ్రాడ్యుయేట్ టూర్ అప్లికేషన్ ను మొట్టమొదటి సారిగా డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చారు.ఇందులో స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా అప్ప్లై చేసుకోవచ్చని తెలిపారు.ఒక వేళ యాప్ వినియోగించుకోక పొతే ఆన్లైన్ ద్వారా కూడా అప్ప్లై చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఈ నూతన విధానం ద్వారా వేలాది మంది భారతీయ విద్యార్ధులకు లబ్ది చేకూరనుందట.ఎందుకంటే అమెరికా మాదిరిగా యూకె లో కూడా భారతీయ విద్యార్ధులు అధికంగా ఉన్నారని, గడిచిన ఏడాది దాదాపు 57 వేలకు మంది పైగా భారతీయ విద్యార్ధులు స్టూడెంట్ వీసా పొందారని వీరందరికీ యూకె లో ఉద్యోగం పొందటం కొత్త విధానం ద్వారా సులభమవుతుందని అంటున్నారు నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube