కాంగ్రెస్ లో రాజీనామాలు.. బీజేపీకి ప్లస్ అయ్యేలా ఉందే..!

అదేంటో గానీ తెలంగాణ‌లో విచిత్ర‌మైన రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి.ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ ఒక ఎత్త‌యితే అనూహ్యంగా కాంగ్రెస్‌కు కొత్త బాస్‌గా రేవంత్‌ను ప్ర‌క‌టించ‌డం మ‌రో ఎత్త‌నే చెప్పాలి.

 Resignations In Congress Should Be A Plus For Bjp, Bjp, Trs, Congress, Telangana-TeluguStop.com

ఎందుకంటే ముందు నుంచి అంద‌రూ వ్య‌తిరేకిస్తున్నా కాంగ్రెస్ ఢిల్లీ నాయ‌క‌త్వం మాత్రం ఆయ‌న‌కు ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ఇక్క‌డ పెద్ద ట్విస్టు అనే చెప్పాలి.దీంతో ఆయ‌న నియామ‌కాన్ని వ్య‌తిరేకిస్తూ ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు, ఆరోప‌న‌లు, భ‌గభ‌గ‌లు మొద‌ల‌య్యాయి.

ఇక కోమ‌టిరెడ్డి వెంట‌క్‌రెడ్డి లాంటి కీల‌క‌నేత‌ల‌యితే ఏకంగా ఢిల్లీ అధిష్టానం మీద‌నే విరుచుకుప‌డుతున్నారు.టీపీసీసీని అమ్ముకున్నారంటూ మండిప‌డుతున్నారు.ఇక మాజీ ఎమ్మెల్యే కేఎల్ ఆర్ ఇప్ప‌టికే రాజీనామా కూడా చేశారు.ఆయ‌న బాట‌లోనే మ‌ర్రి శశిధర్ రెడ్డి కూడా రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం కాంగ్రెస్‌లో ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి.

ఇది రేవంత్‌కు పెద్ద దెబ్బే అని చెప్పాలి.బీజేపీకి ప్రెసిడెంట్‌గా సంజ‌య్‌ను నియ‌మించిన‌ప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేత‌లు ఆహ్వానించారు.

అంద‌రూ వ‌చ్చి ఆయ‌న‌కు విషెస్ చెప్ప‌డ‌మే కాకుండా అండ‌గా నిలిచారు.

కానీ రేవంత్ విష‌యంలో రాజీనామాల ప‌ర్వం మొద‌ల‌యింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క పెద్ద నేత కూడా ఆయ‌న‌ను వ‌చ్చి క‌ల‌వ‌క‌పోడం గ‌మ‌నార్హం.అయితే కాంగ్రెస్‌లో రేవంత్ వ్య‌తిరేకుల రాజీనామాలు చేస్తూ బీజేపీలో చేరేందుకు చూస్తున్నారు.

Telugu @bjp4india, @revanth_anumula, Bandi Sanjay, Mal Klr, Marrisashidhar, Resi

ఎలాగూ టీఆర్ ఎస్‌లోకి వెళ్లినా ప‌దువులు వ‌చ్చే అవ‌కాశం లేదు కాబ‌ట్టి అనూహ్యంగా పుంజుకుంటున్న బీజేపీలోకి వెళ్తే బాగుంటుంద‌ని భావిస్తున్నారు.ఇదే క్ర‌మంలో బీజేపీ కూడా వారిపై ఫోక‌స్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.వారిని క‌మ‌లం గూటికి తెచ్చేందుకు ఇప్ప‌టికే ప‌లువురు కీల‌క నేత‌లు రంగంలోకి దిగినట్టు స‌మాచారం.మొత్తానికి రేవంత్ ఎఫెక్ట్ కాంగ్రెస్‌ను మ‌రింత బ‌ల‌హీన ప‌రుస్తోంద‌నే చెప్పాలి.రేవంత్ వ‌స్తే పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌ని భావించిన వారికి ఇది మింగుడు ప‌డ‌టం లేదు.ఇది రేవంత్‌కు కోలుకోలేని దెబ్బే అని చెప్పాలి.

పార్టీ అధికారంలోకి రావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా బ‌ల‌మైన నాయ‌కులు ఉంటేనే అది సాధ్యం.మరి రేవంత్‌కు వ్య‌తిరేకంగా మారుతున్న వారితో కాంగ్రెస్ మ‌రింత నాయ‌క‌త్వాన్ని కోల్పోతుంద‌నే చెప్పాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube