చేతిలో ఫోన్‌ ఉంది కదా అని అక్కడ సెల్ఫీలు దిగారో.. ఇక అంతే!

మన చేతిలో నిత్యం ఉండే స్మార్ట్‌ ఫోన్‌తో ఎక్కడైన టూరీస్టు ప్రాంతాలకు వెళ్లినప్పుడు క్లిక్‌ అనిపిస్తాం.ఏ సుందరమైన దృశ్యం కనిపించినా.

 Gujarath Government Banned Selfies Taking In Dang Tourist Place, Gujarath,  Indi-TeluguStop.com

మన ఫోన్‌లో బంధించేస్తాం.అయితే, అన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యపడుతుంది కానీ, ఒక ప్రాంతంలో ఇక మనం సెల్ఫీలు దిగడానికి ఛాన్స్‌ ఉండదట.

ఎందుకంటే అక్కడి ప్రభుత్వం సెల్ఫీలను నిషేధించింది.దీంతో ఎవరైనా ఆ ప్రాంతంలో ఫోటో తీసుకుంటే చట్టపరంగా నేరం అవుతుంది.

అది ఎక్కడో ఆ వివరాలు తెలుసుకుందాం.ఆ ప్రాంతం గుజరాత్‌లోని దాంగ్‌.

జిల్లాల్లో జూన్‌ 23 నుంచి అక్కడ అధికారులు ఆ జిల్లా పర్యాటక ప్రాంతంలో సెల్ఫీలు తీసుకోవడాన్ని నిషేధించినట్టు అధికారిక ప్రకటన జారీ చేశారు.టూరీస్టులే కాకుండా స్థానికులు కూడా అక్కడి నదుల్లో స్నానం, బట్టలు ఉతకడం వంటివి చేయకూడదు.

దీనికి ఓ ప్రధాన కారణ ం ఉంది.ఈ టూరీస్టు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాకాలంలో పర్యాటకులు సందర్శన ఎక్కువగా ఉంటుంది.ఇక్కడ ఉండే సుందరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్‌ చేస్తారు.కానీ, అలా ఫోటోలు తీసుకుంటున్నప్పుడు ఇప్పటి వరకు చాలా మంది ప్రమాదవశాత్తు నీటిలో, జ లపాతాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.

ప్రకృతిని ఆస్వాదించడం అందరి హక్కు కానీ, ఈ నేపథ్యంలో వారు అత్యుత్సాహాంతో తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.నీటిని వదిలినప్పుడు కొందరైతే సెక్యూరిటీ వారిని వెళ్లకొట్టిన సెల్పీలు దిగుతారు.

ఆ సమయంలో నీటిని వదలగానే ప్రవాహంలో కోట్టుకుపోయిన ఘటనలు జరిగాయి.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఈ జిల్లా అదనపు కలెక్టర్‌ టీకే దామర్‌ ఈ ఆలోచన చేశారు.

అంతేకాదు ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు.

Telugu Dang, Gujarath, Indian Tourist, River-Latest News - Telugu

ఒకవేళ ఈ జిల్లాల్లోని పర్యాటక ప్రాంతంలో చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైనా సెల్ఫీలు దిగితే వారికి ఐపీసీ సెక్షన్‌ 188 కేసు నమోదు చేస్తామని ఆదేశించారు.ఈ దాంగా జిల్లాలో అందమైనే అడవులు ఉన్నాయి.జలపాతాలు కూడా కనువిందు చేస్తాయి.

కానీ, ఆ జిల్లా వారితోపాటు ఇతర టూరీస్టులు ఇక ఆ ప్రాంతంలో సెల్ఫీలు దిగటాన్ని నిషేధించింది.ఇక కరోనా కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఇక్కడ పర్యాటకులు మళ్లీ వచ్చే అవకాశం ఉంది.

అయితే, ఈ సారి వెళ్లినవారికి ఫోటోలు దిగే ఛాన్స్‌ లేకపోవచ్చు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube