మళ్లీ లాక్ డౌన్ దిశగా ఆ దేశం..?

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా వైరస్ అదుపు చేయడానికి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు లాక్ టౌన్ ప్రకటించి తగు జాగ్రత్తలు తీసుకొని వారి ప్రజలను అప్రమత్తం చేసి కరోనా కేసులు నమోదు చేయగలాగారు.

 That Country Heading Towards Lockdown Again , Lock Down, Australia, 4days, Delta-TeluguStop.com

అయితే, కరోనా మహమ్మారి ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచాన్ని వీడేటట్టు లేదు.రోజురోజుకి కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే మరోసారి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది.

ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియంట్ అతి వేగంగా విస్తరిస్తుందని చాలా మందిని బలి తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలపడం జరిగింది.పరిస్థితులు ఇలా ఉండగా తాజాగా ఆస్ట్రేలియా దేశంలో ఊహించని విధంగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు పెరిగిపోవటంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.

Telugu Australia, Delta, Latest, Lock-Latest News - Telugu

సిడ్నీలో ఒక్క రోజులోనే 150 డెల్టా వేరియంట్ కేసులు బయటపడటం, అదే రీతిలో ఆస్ట్రేలియా దేశంలో ముఖ్య నగరాలు అయినా పెర్త్, డార్విన్, క్వీన్స్ లాండ్ లో కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో.పరిస్థితి చేయి దాటి పోయే అవకాశం ఉండటంతో.ఆస్ట్రేలియా ప్రభుత్వం .త్వరితగతిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో వెంటనే ఈ నగరాలలో నాలుగు రోజులపాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయడం జరిగింది.మరింతగా శ్రమిస్తేనే కేసుల సంఖ్య పెరగకుండా జాగ్రత్త పడవచ్చు అని క్వీన్స్ లాండ్ ప్రీమియర్ అనాస్టాసియా పేర్కొన్నారు.నాలుగు రోజుల అనంతరం పరిస్థితి బట్టి తగిన చర్యలు తీసుకోబోతున్నుట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube