సిగ్గు తగలెయ్య: 10ఏళ్లుగా సిగ్గుతో బయటికి రాలేకపోతున్న వ్యక్తి..!

కరోనా వచ్చిన్పటి నుంచి నుంచి సామాజిక దూరం, ఐసోలేషన్‌ అనేది అందరికి అలవాటైపోయింది.మనకు ఏదైనా ముఖ్యమైన పని ఉండి వేరే ప్రాంతానికి వెళ్లినట్లైతే తిరిగి వచ్చాక స్నానం చేస్తాం.

 Shame On You A Person Who Has Not Been Able To Come Out With Shame For 10 Years-TeluguStop.com

అలాగే రెండు, మూడు రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంటాం.కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత కొందరు ఐసోలేషన్‌లో ఉంటుంటే ఇంకొందరు మాత్రం ఎప్పటినుంచో ఈ సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.

ఏళ్ల తరబడి వారు జనావాసాలకు దూరంగా ఉంటున్నారు.వాల్లు ఇంటికే పరిమితమవుతున్నారు.

తాజాగా అలాంటి ఓ వ్యక్తి గురించే ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్‌కు చెందిన నిటో సౌజీ ఇలాంటి వ్యక్తే.

గత పదేళ్లుగా అతడు ఇంట్లోనే తల దాచుకుంటున్నాడు.ఆయన బయటకు రావాలంటే కేవలం కటింగ్‌ చేయించుకోవడానికి మాత్రమే వస్తున్నాడు.

ప్రొఫెషనల్ ఇండీ గేమ్ డెవలపర్ అయిన సౌజీ 10 ఏళ్ల క్రితం తన స్వస్థలమైన టోక్యోకు రావడం జరిగింది.అప్పటి నుంచి బయటకు వెళ్లడం లేదు.

రెండు, మూడు నెలలకోసారి కేవలం కటింగ్‌ చెయించుకోవడానికి మాత్రమే వెళ్తున్నాడు.ఇంట్లోకి కావాల్సిన వస్తువులు, దుస్తుల కోసం ఆన్ లైన్ షాపింగ్ చేసి తెప్పించుకుంటున్నాడు.తనకు కావాల్సిన వస్తువులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసి డోర్‌ డెలివరీ ద్వారా తెప్పించుకుంటాడు.ఆ వ్యక్తి బయటకు వెళ్లాలంటే చాలు సిగ్గుతో తలదించుకుంటాడు.

సౌజీ ఒక యూట్యూబ్‌ చానెల్‌ని ప్రారంభించాడు.అందులో తన రోజువారి జీవితానికి సంబంధించిన వీడియోలను పెడుతుంటాడు.

జీవితం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైతే సౌజీ మాత్రం రాత్రి ఎనిమిద గంటలకు తన కార్యకాలపాలను ప్రారంభిస్తాడు.

Telugu Meida, Latest-Latest News - Telugu

తెల్లవారుజామున 4 గంటలకు కన్నుమూస్తాడు.ప్రారంభంలో రెండు మూడు ఏళ్లు ఈ విధానం తమకు బాగా మేలు చేసిందని, ఆ తర్వాత ఏకాగ్రతగా పని చేసుకుంటున్నట్లుగా తెలిపాడు.అయితే రాను రాను బయటకు వెళ్లాలంటే సిగ్గుగా, భయంగా అనిపించేదని సౌజీ బయటకు రావడమే మానేశాడు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube