థియేటర్ల విషయంలో ఆ నలుగురి నిర్ణయం కోసం ఇండస్ట్రీ ఎదురు చూపు

టాలీవుడ్‌ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న థియేటర్లు ఒకటి రెండు వారాల్లో తెరుచుకుంటాయని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.తెలంగాణలో లాక్ డౌన్ ను ఎత్తి వేయడం జరిగింది.

 Telugu States Theaters Re Open In Vary Soon , Ap And Telangana,  Theaters , Film-TeluguStop.com

రాత్రి పూట ఆంక్షలు కూడా లేవు.ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని మాట్లాడుతూ తెలంగాణ లో థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు లేవు.

వారి ఇష్టానుసారంగా ఓపెన్‌ చేసుకోవచ్చు.జాగ్రత్తలు తీసుకుంటూ ఇంతకు ముందు మాదిరిగానే కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నాడు.ఏపీలో మాత్రం థియేటర్ల విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది.థియేటర్లు ఎప్పుడు అక్కడ ఇక్కడ తెరచుకునేది అనే విషయంలో మాత్రం స్పష్టత కరవయ్యింది.కాని ఇండస్ట్రీలో కొందరు అంటున్నదాని ప్రకారం ఇండస్ట్రీని శాసించే ఆ నలుగురు ఎప్పుడు థియేటర్ల విషయంలో ఓకే అంటే అప్పుడే బొమ్మ పడే అవకాశం ఉందని అంటున్నారు.

థియేటర్లు ఎక్కువ శాతం దిల్‌ రాజు, సురేష్‌ బాబు, అల్లు అరవింద్‌ ల హ్యాండోవర్ లో ఉంటాయి.

ఏషియన్‌ వారు కూడా అత్యధిక సినిమా థియేటర్ల చైన్ ను కలిగి ఉన్నారు.కనుక ఆ నలుగురు ఎలా అంటే అలా థియేటర్లు ఓపెన్‌ లేదా క్లోజ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

థియేటర్లలో ఉన్న వసతులను మార్చకుండా ఓపెన్‌ చేస్తే కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Telugu Aptelangana, Tollywood-Movie

అనుమానాల విషయం పక్కన పడితే మళ్లీ థియేటర్లు పునః ప్రారంభంకు కనీసం నెల రోజులు పడుతుందని కొందరు అంటున్నారు.జులై నెలలో థియేటర్లను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నా పెద్ద సినిమా ల కోసం ఆగస్టు వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటున్నారు. ఏపీ మరియు తెలంగాణలో ఒకే సారి థియేటర్లను ప్రారంభించాల్సి ఉందని ఇండస్ట్రీ వర్గాల వారి అభిప్రాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube