ప్రాణం మీదకు వచ్చిన మాస్క్ గొడవ.. ఆవేశం అణుచుకోలేని బ్యాంకు సెక్యూరిటీ గార్డు ఎంత పని చేశాడు.. !

ఒక్క క్షణం ఓపిక ఎన్నో సమస్యలను నివారిస్తుంది.ఆవేశం వచ్చినప్పుడు వివేకంతో ఆలోచించాలి, లేదా మౌనంగా ఉండాలని చెబుతారు.

 Security Guard Who Shot A Bank Customer For Not Wearing A Mask, Uttar Pradesh, B-TeluguStop.com

కానీ ఆక్షణం గనుక విచక్షన కోల్పోతే ఆ తర్వాత బాధపడి కూడా ప్రయోజనం ఉండదు.ప్రస్తుతం ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో చోటు చేసుకుంది.

ఇక్కడ పని చేస్తున్న సెక్యూరిటీ గార్డు ఈ బ్యాంకు కస్టమర్ అయిన ఉత్తరప్రదేశ్ బరేలీ కి చెందిన రైల్వే ఉద్యోగి రాజేష్ తో మాస్కు విషయంలో గొడవకు దిగాడట.ఈ క్రమంలో రాజేష్ మాస్క్ పెట్టుకుని తిరిగి బ్యాంకులోకి వెళ్లుతున్న సమయంలో ఇప్పుడు లంచ్ టైం అయ్యిందని అడ్దుకున్నాడట.

తన పాస్ బుక్ ఎంట్రీ చేయించుకోని వస్తానని పెద్దగా పని లేదని చెప్పినప్పటికి వినిపించుకోని ఆ సెక్యూరిటీ గార్డ్ అతనితో వాదనకు దిగాడట.అలా ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆవేశం ఆపుకోలేని గార్డు అతని కాలిపై తుపాకీతో కాల్చడంతో ఆ కస్టమర్ అక్కడే కుప్పకూలిపోయాడట.

ఇది సరేగానీ ఒకవేళ ప్రాణాలు పోతే దీని ఎవరు బాధ్యులో.మరి ఉద్యోగం చేస్తు ఇంత ఆవేశంగా ప్రవర్తించడం సరికాదని అనుకుంటున్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube