ఆ ఫోభియాతో బాధ పడుతున్న లక్ష్మీరాయ్.. గజగజా వణికిపోతూ..?

కొంతమంది హీరోయిన్లకు టాలెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ వేర్వేరు కారణాల వల్ల ఆ టాలెంట్ కు తగ్గ అవకాశాలు రావు.అలా ప్రతిభకు తగ్గ అవకాశాలను పొందలేని హీరోయిన్ల జాబితాలో లక్ష్మీరాయ్ ముందువరసలో ఉన్నారు.

 Raai Laxmi Says She Has Trypanophobia In A Instagram Post,latest Social Media-TeluguStop.com

గడిచిన 15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నా ఆశించిన స్థాయిలో ఈ నటికి సినిమా ఆఫర్లు అయితే రాలేదు.అయితే తాజాగా లక్ష్మీరాయ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

తనకొక ఫోబియా ఉందని లక్ష్మీరాయ్ చెప్పుకొచ్చారు.కెరీర్ మొదట్లో అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రల్లో చేసిన లక్ష్మీరాయ్ ఆ తరువాత గ్లామర్ రోల్స్ లో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.తాజాగా ఈ బ్యూటీ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లారు.అయితే సూది అంటే భయపడే లక్ష్మీరాయ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లిన తరువాత డాకర్లు, నర్సులను చూసి గజగజా వణికిపోయారు.

తాను వ్యాక్సిన్ వేయించుకుంటున్న వీడియోను షేర్ చేసి వీడియోను లక్ష్మీరాయ్ అభిమానులతో పంచుకోగా ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.తనకు సూది అంటే భయపడే ట్రిపనో ఫోబియా ఉందని లక్ష్మీరాయ్ అన్నారు.

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో లక్ష్మీరాయ్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.లక్ష్మీరాయ్ షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు లక్ష్మీరాయ్ కు సినిమాల్లో గ్లామరస్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ చేసే ఆఫర్లు తప్ప ఇతర ఆఫర్లు రావడం లేదు.ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న లక్ష్మీరాయ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో ఈ బ్యూటీ పెళ్లిపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.పెళ్లి తర్వాత ఈ బ్యూటీ సినిమాల్లో నటిస్తారో లేదో తెలియాల్సి ఉంది.ఈ మధ్య కాలంలో ఖైదీ నంబర్ 150 సినిమాలోని రత్తాలు రత్తాలు సాంగ్ లక్ష్మీరాయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube