వైరల్ పిక్: పిచ్చుక, ఉడుత చిట్ చాట్..!

ప్రకృతిలో అత్యంత అందమైన జీవరాశులలో భాగమైన ఉడుతలు, పక్షులు చూపరులను బాగా ఆకట్టుకుంటాయి.ఉడుతలు తమ ముచ్చటగొలిపే అందంతో చూపు తిప్పుకోనివ్వవు.

 Viral Pick Sparrow, Squirrel Chit Chat, Picnic , Viral Pic, Viral News, Viral L-TeluguStop.com

అవి ఆహారం తినేటప్పుడు కూడా చాలా క్యూట్ గా ఉంటాయి.ఇక పిచ్చుకలు కూడా వెంటనే మనుషులను ఎట్రాక్ట్ చేస్తాయి.

అయితే ఈ రెండు అందమైన చిన్న ప్రాణులు ఒకే దగ్గర కనిపిస్తే ఇక ఆ దృశ్యానికి మించిన ప్రకృతి అందం మరెక్కడా కనిపించదేమో.

ఒకే దగ్గర కనిపించడం మాత్రమే కాదు అవి రెండూ కలిసి ఆహారం పంచుకుంటూ కనిపిస్తే.

ఫాంటసీ సినిమాలను చూసినంత అనుభూతి కలుగుతుంది.అయితే ప్రస్తుతం నెటిజన్లు ఆ అనుభూతిని నిజంగానే ఆస్వాదిస్తున్నారు.

ఎందుకంటే ఒక ఉడుత ఒక పిచ్చుక తో కలిసి నిజంగానే చిట్‌చాట్ పెట్టింది.మనుషులు పిక్నిక్ కి వెళ్ళినట్టు ఇవి రెండూ కూడా తమకి ఇష్టమైన ఆహారం తింటూ కెమెరా కళ్ళకు చిక్కాయి.

అయితే ఈ ఫోటో నెట్టింట ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు సో క్యూట్ అంటూ పరవశించి పోతున్నారు.ఈ ఫోటో చాలా క్యూట్ గా ఉండటంతో నెట్టింట క్షణాల్లోనే వైరల్ అయ్యింది.

ఈ అందమైన ఫోటోని ట్విట్టర్ వేదికగా హప్కిన్స్ అనే ఒక హ్యాండిల్ షేర్ చేసింది.ఫ్రెండ్స్ పిక్నిక్ కి వెళ్ళాయి అని ఈ ఫోటోకి ఒక క్యాప్షన్ జోడించింది.అయితే ఒక నెటిజన్ ఈ ఫోటో కింద రెడ్ బస్ ట్రావెల్ సర్వీస్ ని ట్యాగ్ చేసి.ఈ ఉడుతా, పిచ్చుకలకు నెక్స్ట్ ట్రిప్ సమయంలో ఆఫర్ ఇవ్వండి అంటూ సరదాగా కోరాడు.

ఈ ఫోటోలో మిక్కిలి చిన్నదైన టేబుల్ చూడొచ్చు.ఈ టేబుల్ మధ్య భాగంలో నట్స్ ఉంచగా.

ఇరుప్రక్కలా కూర్చోవడానికి వీలుగా రెండు చెక్కలను అమర్చారు.అయితే ఈ చెక్కలపై హాయిగా, ప్రశాంతంగా కూర్చొని మధ్యభాగంలో ఉన్న నట్స్ తింటూ ఉడుత, పిచ్చుక ఎంజాయ్ చేశాయి.

ఒకదాన్నొకటి చూసుకుంటూ ముచ్చట్లు పెడుతున్నట్టే కనిపించాయి.దీంతో నెటిజన్లు సో క్యూట్, లవ్లీ పిక్, వావ్, బ్యూటిఫుల్ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube