కరోనా పేర్లపై వర్మ సెటైర్లు.. చింటూ, ప్యారేలాల్ అని పెట్టమంటూ..?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనేక వివాదాల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.నెటిజన్లు ఆయనను విమర్శించినా ఆ విమర్శలను ఆర్జీవీ అస్సలు పట్టించుకోరు.

 Ram Gopal Varma Suggests Funny Names For Corona Variants, Ram Gopal Varma, Coron-TeluguStop.com

ఆర్జీవీని విమర్శించే వాళ్లు ఎంతమంది ఉన్నారో సమర్థించే వాళ్లు కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం.ఏం చెప్పాలని అనుకున్నా ముక్కుసూటిగా చెప్పే ఆర్జీవీ కొన్నిసార్లు చెప్పే విషయాల ద్వారా విమర్శల పాలవుతుంటారు.

రామ్ గోపాల్ వర్మ చేసిన విచిత్రమైన వ్యాఖ్యలు, ఆయ చేష్టలు నెటిజన్ల నుంచి తరచూ విమర్శలను ఎదుర్కొంటూ ఉంటాయి.తాజాగా వర్మ కరోనా వేరియంట్ల గురించి మాట్లాడుతూ తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్లు వేశారు.

దేశంలో కొత్తకొత్త కరోనా వేరియంట్లు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఆ వేరియంట్లకు పేర్లు పెడుతున్న సంగతి తెలిసిందే.గుర్తు పెట్టుకోవడం కష్టమయ్యే విధంగా శాస్త్రవేత్తలు పేర్లు పెడుతున్నారని వర్మ అన్నారు.

సుబ్బారావ్, దేవిడ్, జాన్, చింటూ, ప్యారేలాల్ లాంటి పేర్లను కరోనా వేరియంట్లకు ఎందుకు పెట్టడం లేదని శాస్త్రవేత్తలను వర్మ ప్రశ్నించారు.అయితే వర్మ ట్వీట్ గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఈ మాత్రం తెలివితేటలు లేకుండా సినిమాలు తీస్తున్నావా.? అంటూ నెటిజన్లు వర్మను ట్రోల్ చేస్తుండగా మరికొందరు అలా పేర్లు పెట్టడానికి గల కారణాలను వర్మకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

వర్మ ఫ్యాన్స్ మాత్రం వర్మ ఎప్పటికీ మారడని కామెంట్లు చేస్తుండటం గమనార్హం.వర్మ కరోనా వేరియంట్ల గురించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.ఆరు పదుల వయస్సులో కూడా వర్మ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోకపోవడం గమనార్హం.మరోవైపు అరియానా వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూకు లక్షల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.ఈ ఇంటర్వ్యూ విషయంలో చాలామంది వర్మను తెగ ట్రోల్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube