గర్భవతిగా ప్రియమణి.. ఏ సినిమాలో అంటే?

టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రియమణి.ప్రస్తుతం ప్రియమణి వరుస ఆఫర్ లతో బాగా బిజీగా ఉంది.

 Priyamani Is Pregnant In That Movie Priyamani, Tollywood, Pregnant, Dhee Show, T-TeluguStop.com

తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన ప్రియమణి తన నటనతో మంచి సక్సెస్ అందుకుంది.స్టార్ హీరోల సరసన కూడా నటించింది.

మొదట్లో తెలుగమ్మాయిగా కనిపించిన ప్రియమణి ఆ తర్వాత గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.తన పెళ్లి తర్వాత గతంలో సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ మళ్లీ రీ ఎంట్రీ తో బాగా బిజీ గా మారింది.

బుల్లితెరలో కూడా ఓ డాన్స్ షోలో జడ్జి గా చేసిన సంగతి తెలిసిందే.లేటు వయసులో కూడా తన గ్లామర్ ను పరిచయం చేస్తుంది.ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ ప్రస్తుతం బాగా స్లిమ్ గా తయారయింది.ఇక ఇటీవలే రాజు డీకే దర్శకత్వంలో ది ఫ్యామిలీ మాన్ 2 లో నటించగా తన నటనకు మంచి సక్సెస్ అందుకుంది.

అంతేకాకుండా దగ్గుబాటి రానా నటించిన విరాటపర్వంలో కీలక పాత్రలో నటిస్తుంది. హీరో వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలో కూడా నటిస్తుంది.

ఇదిలా ఉంటే మరో సినిమాలో గర్భవతిగా కనిపించనుందట ప్రియమణి.

Telugu Dhee Show, Pregnant, Priyamani, Tollywood, Yact-Movie

గత ఏడాది కన్నడలో మన్సో రే దర్శకత్వంలో యాక్ట్ 1978అనే సినిమా విడుదల కాగా ఇందులో యజ్ఞ శెట్టి కీలక పాత్రలో నటించింది.ఈ సినిమాకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి.ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేయగా.

ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది.నిర్మాత ఠాగూర్ మధు ఈ సినిమాకు సంబంధించిన రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ఇందులో ప్రియమణి గర్భవతి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

Telugu Dhee Show, Pregnant, Priyamani, Tollywood, Yact-Movie

ఈ కథలో ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన నష్టపరిహారం కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి విసిగిపోయిన మహిళా పాత్రలో రూపొందనుంది.ఇక ఇందులో ఆ పాత్రలో ప్రియమణి నటించనుండగా చివరికి తన మనోధైర్యంతో ఆఫీసులో ఎవరిని బయటకు వెళ్లకుండా తలుపులు మూసేసి ఆ తర్వాత సాగే కథతో తెరకెక్కనుంది.ఇక ఈ సినిమా గురించి త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube