పవన్ సైలెన్స్.. బీజేపీ పరేషాన్ ?

పవన్ మనసులో ఏముందో ఏంటో తెలియక బీజేపీ చాలా ఆపరేషన్ అవుతోంది.మిత్రపక్షంగా ఉన్న జనసేన తమతో కలిసి యాక్టివ్ గా ఉద్యమాల్లో పాల్గొంటుంది అని అంచనా వేస్తున్నా, ఆ పార్టీ నేతలు సైలెంట్ గా ఉండిపోవడం,  ముఖ్యంగా పవన్ అసలు రాజకీయాలకు తనకు సంబంధం లేదు అన్నట్లుగా సినిమాల్లోనే బిజీగా ఉంటూ, హైదరాబాద్ లోనే మకాం వేయడంతో ఏపీ జనసేన కార్యకర్త లోనూ గందరగోళం నెలకొంది.

 Bjp Angry On Pawan Kalyan Silence, Janasena, Pawan Kalyan, Bjp, Ap, Tdp, Ap Gov-TeluguStop.com

జనసేన నుంచి స్పష్టమైన క్లారిటీ ఏది తెలియకపోవడంతో బీజేపీ ఒంటరిగానే ఉద్యమాలను చేస్తోంది.గతంతో పోలిస్తే ఈ ఉద్యమాల స్పీడు మరింత పెంచింది.

వైసీపీ తో ఇప్పటి వరకు ఉన్న మొహమాటాన్ని పూర్తిగా పక్కన పెట్టి , ప్రతి విషయం పైన ప్రశ్నిస్తోంది.
  జిల్లాల వారీగా ఆందోళనలు నిర్వహిస్తోంది.

రాబోయే రోజుల్లోన వైసీపీపై తాము ఇదే వైఖరితో ఉంటాము అన్నట్లుగా వ్యవహారం చేస్తోంది.అయినా పవన్ మాత్రం పెద్దగా స్పందించడం లేదు.

అప్పుడప్పుడు పార్టీ తరఫున ఏదైనా ప్రెస్ నోట్ మాత్రమే విడుదల అవుతోంది.  అప్పుడప్పుడు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాత్రమే ఏదైనా విషయంలో స్పందిస్తున్నారు.

దీంతో పవన్ జనసేన తో పాటు , ఇటు బీజేపీ నాయకుల్లోనూ టెన్షన్ పెరిగిపోతోంది.బలంగా ఉన్న వైసిపి, టిడిపి వంటి పార్టీలను ఢీ కొట్టాలి అంటే ఆషామాషీ రాజకీయాలు చేస్తే సరిపోదని, నిత్యం జనాల్లో ఉండేలా సరికొత్త ఎత్తుగడలు వేయాలని, కానీ ఈ విధంగా రాజకీయాల్లో వ్యవహరిస్తుండడం వల్ల మొదటికే మోసం వస్తుందనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది.

Telugu Ap, Janasena, Janasenabjp, Janasenani, Modi Amit Sha, Pawan Kalyan, Somu

  తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు బాగా దెబ్బతీసినా, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జనసేన బీజేపీ కూటమి ప్రభావం చూపించక పోతే, ఏపీలో ఇక కనుమరుగు కావాల్సిందే అనే భయము ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది.పవన్ సినిమాల్లో బిజీగా ఉండడం వల్లే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేక పోతున్నారు అని పవన్ సన్నిహితులు అప్పుడప్పుడు ప్రకటనలు చేస్తున్నా బీజేపీ మాత్రం ఆగ్రహంగానే ఉందట .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube