విష్ణుమూర్తి కూర్మావతారం చాలించడం వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?

పురాణాల ప్రకారం లోకకల్యాణార్థం, ధర్మాన్ని కాపాడటం కోసం విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తిన సంగతి మనకు తెలిసిందే.ఈ విధంగా దశావతారాలలో రెండవ అవతారమే కూర్మావతారం.

 Interesting Facts About Vishnu Murthy Kurmavataram, Vishnu Murthy Kurmavataram,-TeluguStop.com

అయితే విష్ణుమూర్తి కూర్మావతారం ఎత్తడానికి గల కారణం? కూర్మావతారాన్ని చాలించడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….

పురాణాల ప్రకారం రాక్షసులు దేవతలు అమృతం కోసం సాగర మథనం చేస్తున్న సమయంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని దానిని పాలసముద్రంలో వేస్తే అది బరువుకు సముద్రంలో మునుగుతుంది.

దీంతో దేవతలు రాక్షసులు ఏం చేయాలో తెలియక ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు.దీంతో విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతం కింద ఉండి దాని బరువును మోస్తాడు.ఈ క్రమంలోనే దేవతలు రాక్షసులు దానిని చిలకడానికి ప్రయత్నించగా ఆ పర్వతం కదలలేదు.అప్పుడు దేవతలు రాక్షసులు మరో మారి కుర్మాన్ని ప్రార్థించగా అప్పుడు కూర్మావతారంలో ఉన్న విష్ణుమూర్తి తన శరీరం నుంచి పదివేల చేతులను మొలిపింప చేసి, ఆ పర్వతాన్ని కదలనీయక పట్టుకోవడంతో క్షీర సాగర మథనం చేయడానికి వెసులుబాటు కల్పిస్తాడు.

దీంతో సాగరం నుంచి అమృతం ఉద్భవిస్తుంది.

Telugu Brugu Maharshi, Vishnumurthy, Kurmavataram, Lordvishnum, Vaikuntam, Vishn

ఈ విధంగా ఉద్భవించిన అమృతాన్ని సేవించి దేవతలందరూ వెళ్ళిపోయిన తర్వాత కూర్మ రూపునికి, భృగు మహర్షి శాపం పెట్టాడు.శాపం కారణంగా మతిమరపుతో ఎంతో గర్వంతో తన వల్లనే అమృతం లభించిందని, దేవాసుర కన్నాతానే గొప్పవాడని తన పదివేల చేతులతో సముద్రాన్ని అల్లకల్లోలం సృష్టించాడు.ఈ కూర్మం బీభత్సాన్ని భరించలేక దేవతలు ఆ పరమశివుని ప్రార్థించారు.

ఆ కూర్మం గర్వాన్ని అణచి వేయడానికి తన పుత్రులు ఎంతో సమర్థవంతులని భావించిన పరమేశ్వరుడు తన పుత్రులిద్దరిని కూర్మం గర్వం అణచి వేయడానికి వేయడానికి పంపుతాడు.అయితే ఆ కూర్మం బలం మొత్తం తన వీపు పై ఉన్న చిప్పలో ఉందని గ్రహించిన సుబ్రహ్మణ్యుడు దానిని ఒడ్డుకు లాక్కొనివచ్చి వెల్లకిలా వేసాడు.

తరువాత ఒక పెద్ద రోకలి బండతో సహోదరులిద్దరు దానిని చితక బాది, చిప్పనుపేరు చేయడంతో నిజం తెలుసుకున్న విష్ణుమూర్తి కూర్మావతారాన్ని అంతటితో చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube