హమ్మయ్య లోకేష్ విజయం సాధించేశారు ! చిటికెలు చిటికెలు

తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా

లోకేష్

ప్రమోషన్ కార్యక్రమం ఎక్కువైంది.దీనికి తగ్గట్లుగానే ఆయన ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ, చంద్రబాబు స్థాయి వ్యక్తి గా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 Tdp, Telugudesam Party, Ysrcp, Chandrababu, Nara Lokesh, Chinababu, Inter Examsm-TeluguStop.com

అలాగే పార్టీలో లోకేష్ మద్దతుదారులు ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతూ వస్తున్నారు.సోషల్ మీడియా, టీడీపీ అనుకూల మీడియాలోనూ ప్రమోషన్ పెరిగింది.

ఆ విధంగా చంద్రబాబు ఎత్తుగడలు వర్కవుట్ అవుతున్నాయి.పార్టీలో యువ నాయకులకు ప్రాధాన్యం పెంచి, రాబోయే రోజుల్లో లోకేష్ రాజకీయ భవిష్యత్తు కు ఇబ్బందులు లేకుండా ముందు చూపుతో బాబు వ్యవహరిస్తున్నారు.

ఏపీలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణ పై ఏపీ ప్రభుత్వం ఒకే అభిప్రాయంతో ఉంటూ వచ్చింది.ఏదో రకంగా  పరీక్షలను నిర్వహించి తీరాలనే పట్టుదలతో వ్యవహరిస్తోంది.

Telugu Chandrababu, Chinababu, Interexamsm, Lokesh, Telugudesam, Ysrcp-Telugu Po

అయితే కరోనా వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్ట లేదు కాబట్టి, పరీక్ష నిర్వహణ వాయిదా వేసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్తున్నా ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.ఈ అంశంపై నారా లోకేష్ ఆధ్వర్యంలో పెద్ద పోరాటం మొదలయ్యింది.విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఈ అంశంపై ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు.అయినా ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయించారు.

Telugu Chandrababu, Chinababu, Interexamsm, Lokesh, Telugudesam, Ysrcp-Telugu Po

ఇతర రాష్ట్రాలలో పరీక్షలను రద్దు చేస్తుంటే ఏపీ లో మాత్రం రద్దు చేయడం లేదంటూ పిటిషన్ వేయడంతో, సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణ పై వెనక్కి తగ్గి పరీక్షలను రద్దు చేశారు.ఇక ఆ నిర్ణయం వెలువడిన దగ్గర నుంచి నారా లోకేష్ దే ఆ ఘనత అంటూ, లోకేష్ మద్దతుదారులు, టిడిపి నాయకులు హడావుడి చేస్తూ మీడియా లో మాట్లాడుతుండడం, ఇది లోకేష్ పోరాట ఫలితంగానే సాధ్యమైందని, ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది అని, ఇవే కాదు ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఏపీ ప్రభుత్వ అరాచక పాలనకు చరమగీతం పాడుతాము అంటూ హడావుడి చేసే నాయకుల సంఖ్య టీడీపీ లో మొదలయ్యింది.టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు అంశంపై విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంలో పిటిషన్ వేసినా, క్రెడిట్ మొత్తం లోకేష్ దే అన్నట్లుగా టీడీపీ లో ఇప్పుడు బజన కార్యక్రమం మొదలయ్యింది అనే సెటైర్లు ఎక్కువయ్యాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube