ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు..!

ఎట్టకేలకు ఏపీలో కూడా టెన్త్ ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించారు.విద్యార్ధుల భవిష్యత్ దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని అనుకున్నా ఆ ప్రయత్నాని వెనక్కి తీసుకుంది.

 Ssc And Inter Exams Cancelled In Ap, Adimulapu Suresh, Ap, Cancelled, Eams, Inte-TeluguStop.com

కొద్దిసేపటి క్రితం ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షకు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.సుప్రీం కోర్ట్ లో విచారణ జరిగిన విషయాన్ని వెల్లడించిన మంత్రి సురేష్ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటన మొత్తం 45 రోజుల సమయం పడుతుందని.

సుప్రీం కోర్ట్ చెప్పిన విధంగా వచ్చే నెల 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని చెప్పారు.అనేక తర్జన భర్జనల అనంతరం పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు.

ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నామని చెప్పిన ఆదిమూలపు సురేష్ పదో తరగతి పరీక్షలను కూడా రద్దు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.అయిఏ మార్కుల అసెస్మెంట్ ఎలా చేయాలనే దానిపై హై పవర్ కమీటీని నియమించామని అన్నారు.

సుప్రీం పెట్టిన డెడ్ లైన్ లోపల పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని అందుకే పరీక్షలు రద్ధు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్.పరీక్షలు రద్దు కావడంతో విద్యార్ధులు రిలాక్స్ ఫీల్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube