న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఏపీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల్లో లాటరీ ప్రవేశం

నాగార్జునసాగర్ లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కర్నూలులోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కళాశాలల్లో 2021 22 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు లాటరీ పద్ధతి, ఇంటర్మీడియట్ లో సాధించిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి కళాశాలలను కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రసన్నకుమార్ తెలిపారు.

 Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold-TeluguStop.com

2.తెలంగాణలో రాగల మూడు రోజులు మోస్తారు వర్షాలు

తెలంగాణలో రాగల మూడు రోజులలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.

3.దివ్యాంగ యువతకు ఉచిత శిక్షణ

హైదరాబాద్ దివ్యాంగులకు నోబెల్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఎస్ఐ పి డి ఏ కార్యక్రమంలో భాగంగా డిటీపీ, కస్టమర్ కేర్, సీవింగ్ మెషిన్ అపరేటర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.మరిన్ని వివరాలకు 8886302244 నంబర్ లో సంప్రదించాలన్నారు.

4.పెద్ద పులి సంచారం

Telugu Ap Telangana, Cm Pics Letter, Gold, Jagan, Mudragada, Raghurama, Top, Tsw

కొమురం భీం పెంచికల్ మండలంలోని లోడ్ పల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి కలకలం రేపుతోంది.తెల్లవారుజామున ప్రధాన రహదారికి సమీపంలో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

5.టినా ప్రైమ్ డే యాప్ తో మోసాలు

దేనా ప్రైమ్ యాప్ పాల్పడిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.పెట్టుబడి పెట్టిన సొమ్ముకు డబుల్ సంపాదించవచ్చు అని పలువురిని మోసగించడం పై అనేకమంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దీనిపై కేసు నమోదయ్యింది.

6.టీ ఎస్సార్ జేసీ సెట్ 2021 ఫలితాలు విడుదల

Telugu Ap Telangana, Cm Pics Letter, Gold, Jagan, Mudragada, Raghurama, Top, Tsw

తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి.

7.25 నుంచి టూరిజం బస్సులు

లాక్ డౌన్ తో నిలిచిపోయిన పర్యాటక సంస్థ బస్సులు ఈ నెల 25 నుంచి యథావిధిగా ప్రారంభం కానున్నాయి.

8.కేంద్ర మాజీ మంత్రి పై ఎన్నికల సంఘం వేటు

కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది చట్టసభల్లో పోటీ చేయకుండా సీఈసీ వేటు వేసింది.

9.ఇంటర్ ఫలితాలపై సుప్రీం ఆదేశాలు

Telugu Ap Telangana, Cm Pics Letter, Gold, Jagan, Mudragada, Raghurama, Top, Tsw

జులై 31 లోగా ఇంటర్ ఫలితాలను వెల్లడించాలని రాష్ట్రాల బోర్డ్ కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

10.వివేక హత్య కేసు

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ 18వ రోజు కొనసాగింది.కడప సెంట్రల్ జైలు కేంద్రంగా సిబిఐ విచారణ కొనసాగుతోంది.

11.సూరత్ కోర్టు కు రాహుల్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుజరాత్ లోని సూరత్ కోర్టు కు హాజరయ్యారు.ఆయనపై 2019లో పరువునష్టం కేసు దాఖలైంది.

12.సీఎం జగన్ కోపం ముద్రగడ ఫోటో లేఖ

Telugu Ap Telangana, Cm Pics Letter, Gold, Jagan, Mudragada, Raghurama, Top, Tsw

ఏపీ సీఎం జగన్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కు ఫోటో లేఖ రాశారు.బీజేపీ సీనియర్ నేత అద్వానీ అశోక్ గజపతిరాజు ఎంతో గౌరవంగా ఆహ్వానించిన ఫోటో ను లేఖ ద్వారా ముఖ్యమంత్రికి పంపించారు .

13.సోనియా వీడియో కాన్ఫరెన్స్

కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఏఐసీసీ కార్యదర్శులు, ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

14.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా  54,069 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

15.రెండేళ్ల బాలికకు కోవాక్సిన్ మొదటి టీకా

Telugu Ap Telangana, Cm Pics Letter, Gold, Jagan, Mudragada, Raghurama, Top, Tsw

ఉత్తరప్రదేశ్ లో మొట్టమొదటిసారి కాన్పూర్ దేహత్ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలికకు వ్యాక్సిన్  మొదటి డోసు టీకా వేశారు.

16.రాష్ట్రపతి రైలు ప్రయాణం

భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రేపు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లోని తన స్వగ్రామమైన పరుంఖ్ సందర్శనకు రైలులో ప్రయాణించనున్నారు.

17.28 నుంచి కింది కోర్టులో ప్రత్యక్ష విచారణ

తమిళనాడులో ఈనెల 28 నుంచి కిందిస్థాయి కోర్టుల్లో ప్రత్యక్ష కేసుల విచారణ చేపట్టనున్నారు .ఈ మేరకు మద్రాస్ హైకోర్టు రిజిస్టర్ ఆదేశాలు జారీ చేశారు.

18.జగన్ కు రఘురామ మరో లేఖ

Telugu Ap Telangana, Cm Pics Letter, Gold, Jagan, Mudragada, Raghurama, Top, Tsw

వైసిపి రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ కు మరో లేఖ రాశారు.ఏపీ పోలీస్ కంప్లైంట్ ఆధారిటీ చైర్మన్ గా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజు నియామకాన్ని రఘురామ తప్పుపట్టారు.

19.రోహిణి సింధూరి పై పరువు నష్టం దావా

కర్ణాటకలో మైసూరు జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన రోహిణి సింధూరి పై అదే జిల్లాకు చెందిన జెడిఎస్ పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సారా మహేష్ 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ap Telangana, Cm Pics Letter, Gold, Jagan, Mudragada, Raghurama, Top, Tsw

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 46,190

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,190

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube