రోడ్ షోలు.. ప్రచారాలు.. ఇంచార్జీలు ! వామ్మో హడావుడి మామూలుగా లేదు 

ఎన్నికలు అంటే మామూలుగా ఉండదు.సాధారణ ఎన్నికలు అయినా, ఉప ఎన్నికలు అయినా , రాజకీయ పార్టీలు వాటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, జనాల్లో తమ సత్తా ఎంతవరకు ఉంది అనే విషయాన్ని తెలుసుకునే పనిలో నిమగ్నం అవుతాయి.

 All Partyes Tention On Hujurabad By Elections Telangana, Bjp, Etela Rajendar, Hu-TeluguStop.com

ప్రత్యర్ధులను దెబ్బతీసే విధంగా వ్యూహాలు రచిస్తూ, తమ పార్టీకే విజయం దక్కేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ప్రస్తుతం హుజురాబాద్ లో ఈ తరహా హడావుడి మొదలైపోయింది.

టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి రాజీనామా చేయడంతో, అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.టిఆర్ఎస్ కు హుజురాబాద్ లో పట్టు దొరక్కుండా చేసి మళ్ళీ విజయం దక్కించుకునేలా ఆయన వ్యూహాలు పన్నుతున్నారు.

ఎమ్మెల్యేలు, మంత్రులను నియోజకవర్గ, మండలాల వారీగా ఇంచార్జీలుగా  నియమించి టిఆర్ఎస్ కి మళ్ళీ విజయం దక్కేలా చేసే ప్రయత్నం లో ఆ పార్టీ అధినాయకత్వం ఉంది.

Telugu Bandi Sanjay, Congress, Dubbaka Mla, Inchaeges, Etela, Etela Rajendar, Hu

ఇంకా ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఎన్నికల తేదీ దగ్గర కు వచ్చినట్టుగా అన్ని పార్టీలు హడావుడి చేస్తున్నాయి.ఈ విషయంలో బీజేపీ యాక్టివ్ గానే ఉంది.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు జమ్మికుంట, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు కు జమ్మికుంట గ్రామీణ, మాజీ ఎంపి చాడ సురేష్ రెడ్డి కి ఇల్లందకుంట, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కు హుజురాబాద్ , మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కు కమలాపూర్, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కి హుజురాబాద్ గ్రామీణం, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డికి వీణవంక మండలాలకు ఇన్చార్జిలుగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ నియమించారు.

Telugu Bandi Sanjay, Congress, Dubbaka Mla, Inchaeges, Etela, Etela Rajendar, Hu

అలాగే ఉప ఎన్నికల ఇన్చార్జిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని, సహ ఇన్చార్జిగా మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణలను ఇప్పటికే నియమించారు.మొత్తంగా రాజేంద్ర గెలుపు కోసం బిజెపి గట్టిగా వ్యూహాలు రచిస్తోంది.ఇక నిత్యం ప్రజల్లో ఉండేలా ఏదో ఒక కార్యక్రమాన్ని రూపొందించి నియోజకవర్గ ప్రజల్లో బిజెపి అభ్యర్థి రాజేందర్ కు సఖ్యత ఏర్పడే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పటికే స్థానిక నాయకుల ద్వారా గ్రామాల్లో ప్రచారం మొదలు పెట్టింది బిజెపి.

ఇక కాంగ్రెస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటనలు మొదలుపెట్టారు.

ఇక టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీ కేడర్లో ఉత్సాహం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

కమలాకర్, కొప్పుల ఈశ్వర్, బాల్క సుమన్ వంటి నేతలు నియోజకవర్గం పై పట్టు సాధించేలా వ్యూహాలకు రూపొందిస్తున్నారు.ఇలా ఎవరికి వారు హడావుడిగా ఎన్నికల్లో గెలిచే విధంగా వ్యూహాలు రూపొందించుకునే పనిలో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube