ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి పలువురు నటులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.అందులో నటుడు ప్రకాష్ రాజ్ కూడా మా అధ్యక్షుడిగా పోటీ చేయడానికి ముందుకు వచ్చాడు.
ఈ నేపథ్యంలో కరాటే కళ్యాణి ప్రకాష్ రాజ్ పోటీ గురించి కొన్ని కామెంట్స్ చేసింది.ఆయనకు ఓటు వేసే ప్రసక్తే లేదని ఓపెన్ గా మాట్లాడింది.
తమిళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలో తెలుగు వాళ్లకి అవకాశం ఇవ్వనప్పుడు ప్రస్తుతం మా ఎన్నికల్లో వాళ్ళు ఎందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించింది.ప్రకాష్ రాజ్ మంచి నటుడని, తెలుగు వారికి దగ్గరైన వ్యక్తని, సోషల్ సర్వీస్ లో కూడా ముందు ఉంటాడని తెలిపింది.
ఆర్టిస్ట్ గా ఆయనని ఆదరిస్తామని తెలిపింది.ఈ నేపథ్యంలో మా అధ్యక్షుడిగా చిరంజీవి సపోర్ట్ ఆయనతో పాటు అందరికీ ఉంటుందని అంటుంది.
తమిళ, కన్నడ ఇండస్ట్రీ వాళ్ళు తెలుగు వాళ్లకు అవకాశాలు ఇవ్వరు అలాంటిది అధ్యక్షుని బాధ్యత ఎలా ఇస్తారని ప్రశ్నిస్తుంది.అలాంటప్పుడు ప్రకాష్ రాజ్ ఇక్కడ వచ్చి పోటీ చేస్తే ఇక్కడ వాళ్ళు ఏం కావాలి అంటూ ప్రశ్నించింది.తెలుగులో చాలామంది మా కార్డు ఉన్నవాళ్లు ఉన్నార .దీంతో ఎవరైనా పోటీ చేయొచ్చు.కానీ ఇక్కడ ఎవరు లేరు కాబట్టి పోటీ చేస్తా అనే వాదనను ఖండిస్తున్నానని తెలిపింది.ప్రకాష్ రాజ్ ఇక్కడ పోటీ చేస్తే తెలుగు వాళ్ళని కూడా అక్కడ పోటీ చేయడానికి ఒప్పుకోవాలి అంటూ మెంబర్ గా పోటీ చేయడం అనేది ఆయన ఇష్టమని తెలిపింది.
ఇక ఆయనకు సపోర్ట్ ఎవరు చేస్తారనేది తనకు డౌట్ అని కానీ తాను మాత్రం ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేయనని నేరుగా చెప్పేసింది. నిజానికి ప్రకాష్ రాజ్ కో ఆర్టిస్టులతో మాట్లాడాడని తెలిపింది.దానికి తానే ఉదాహరణ అని, ఆయన అదో రకంగా మాట్లాడుతుంటాడని ఆయన గురించి అసలు రూపాన్ని బయటపెట్టింది.ఆర్టిస్ట్ గా ఆయనను నెత్తిమీద పెట్టుకుంటాం అన్నీ చేస్తాం కానీ అధ్యక్ష పదవికి మాత్రం ఒప్పుకోము.
మనవాళ్లే అధ్యక్షులు కావాలని అదే తన అభిప్రాయం అని తెలిపింది.