తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ?

సమయ స్ఫూర్తి తో రాజకీయాలు చేయడం తెలంగాణ సీఎం కేసీఆర్ కు మొదటి నుంచి అలవాటు.రాబోయే విపత్తును ముందుగానే గ్రహించి, దానికి అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్లడం కెసిఆర్ స్టైల్.

 Kcr In The Idea Of Going For Early Elections In Telangana , Trs, Kcr, Bjp, Congr-TeluguStop.com

ఆ వ్యూహంతోనే  ఆయన ముందుకు వెళ్లి సక్సెస్ అవుతూ ఉంటారు.అయితే ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఒకవైపు ఈటెల రాజేందర్ వ్యవహారం ఉండగా, మరోవైపు తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేయాలనే ఆకాంక్ష కేసీఆర్ లో ఎక్కువ అవుతోంది.సరిగ్గా ఇదే సమయంలో త్వరలోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారనే లీకులను మీడియాకు ఇచ్చారు.

ఈ వ్యవహారంపై ప్రజల్లో చర్చ జరిగేలా చేసి, ఈ విషయంలో జనాల అభిప్రాయం ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కెసిఆర్ చేస్తున్నారు.

ఈ ఉద్దేశంతోనే ఇప్పుడు ముందస్తు ఎన్నికల వ్యూహంపై చర్చ జరిగేలా ప్లాన్ వేశారు.

ఒకవైపు చాపకింద నీరులా బిజెపి తెలంగాణలో బలం పెంచుకుంటూ వస్తోంది.ఏ చిన్న అవకాశం దొరికినా టిఆర్ఎస్ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగేలా చేస్తోంది.2023 ఎన్నికల వరకు ఆగితే, బిజెపి బలం రెట్టింపు అవుతుంది అనే ఆలోచనతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అభిప్రాయానికి వచ్చారట.అయితే ముందుగానే జనాల్లో ముందస్తు ఎన్నికలపై వారి అభిప్రాయం ఏమిటి ? ఒకవేళ నిజంగా ఎన్నికలకు వెళ్లినా టీఆర్ఎస్ కు ఎంతవరకు కలిసివస్తుందనే విషయాలపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

Telugu Congress, Delhi, Programes, Sheems, Intligence, Sarve, Telangana-Telugu P

కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో, ఇక జిల్లాల వారీగా పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మళ్లీ టీఆర్ఎస్ కు ఎదురు లేకుండా చేసుకోవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు గా కనిపిస్తున్నారు.వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి.వాటితో పాటే ఎన్నికలకు వెళ్లాలా లేక విడిగా ఎన్నికలకు వెళ్లాలా అనే విషయంపై లెక్కలు వేసుకుంటునట్లు సమాచారం.2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి, ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యారో, ఇప్పుడు అదే విధంగా సక్సెస్ కావాలన్నది కెసిఆర్ అలోచనగా టీఆర్ఎస్ కీలక నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube