బాలయ్య 'అఖండ' కెజిఎఫ్ తో పోటీ పడబోతుందా..?

కరోనా కారణంగా సినిమాలు అన్ని వాయిదాలు పడిన సంగతి తెలిసిందే.కరోనా తగ్గి మళ్ళీ షూటింగ్స్ స్టార్ట్ చేయదు.

 Kgf Chapter 2 Vs Akhanda Movie, Kgf Chapter 2, Akhanda, Yash, Balakrishna, Boyap-TeluguStop.com

కానీ మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ ఎక్కడి షూటింగ్స్ అక్కడే నిలిచి పోయాయి.మళ్ళీ ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడడంతో ఒక్కటిగా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాయి.

ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు రిలీజ్ డేట్స్ కోసం చూస్తున్నాయి.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Kgf Chapter, Kgfchapter, Prashanth

చాలా సినిమాలు కరోనా కారణంగా షూటింగ్ పూర్తి అయినా విడుదల అవ్వలేదు.అయితే ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అవ్వగానే రిలీజ్ చెయ్యడానికి సిద్ధం చేసుకుంటున్నారు.కానీ సినిమాలు చాలా ఉండడంతో రిలీజ్ డేట్స్ క్లాషెస్ అవుతున్నాయి.

అలాగే అఖండ, కెజిఎఫ్ సినిమాలు కూడా పోటీ పడ బోతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

అసలే పండుగలు సీజన్స్ అవ్వడం వల్ల తమ సినిమాలు రిలీజ్ చేయడం కోసం మేకర్స్ పోటీ పడుతున్నాయి.

అలాగే వినాయక చవితి వీక్ లో అఖండ, కెజిఎఫ్ సినిమాలు రాబోతున్నాయని టాక్.ఈ సినిమాలు ఒకేసారి వస్తే మాత్రం ఖచ్చితంగా గట్టి పోటీనే ఉండబోతుంది.

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలు పెరిగాయి.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Kgf Chapter, Kgfchapter, Prashanth

ఎందుకంటే బాలయ్య బోయపాటి కాంబోలో ఇప్పటికే రెండు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి.అందుకే ఇప్పుడు రాబోతున్న హ్యాట్రిక్ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.అటు కెజిఎఫ్ సినిమా కూడా తక్కువ ఏం కాదు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కెజిఎఫ్ చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

అందుకే కెజిఎఫ్ చాప్టర్ 2 మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమాతోనే ప్రశాంత్ నీల్, యష్ ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.మరి చూడాలి ఈ రెండు సినిమాలు విడుదల తేదీని ఎలా ప్లాన్ చేసుకుంటాయో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube